Breaking News

అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిన బైక్.. నలుగురు మైనర్లు మృతి


ఒడిశాలో ఘోర చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. కోరాపుట్ జిల్లా పాడువ వద్ద అదుపుతప్పి ద్విచక్రవాహనం లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు బాలురు దుర్మరణం చెందారు. గురువారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా.. పాడువ వద్ద వీరి వాహనం ఓ చెట్టును ఢీకొట్టి అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఆ సమయంలో భారీ వర్షం కురవడంతో బాధితులు బయటకు రాలేకపోయారు. దీంతో తీవ్ర గాయాలతో అక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరంతా మైనర్లు కాగా.. ఎవరు? ఎక్కడ నుంచి వస్తున్నారు? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానికులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం కోరాపుట్ హాస్పిటల్‌కు తరలించారు. గుర్తుతెలియని వ్యక్తులుగా కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను గుర్తించే ప్రక్రియ సాగుతోందని పోలీసులు తెలిపారు.


By July 03, 2020 at 09:44AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/four-minor-boys-killed-in-road-accident-in-koraput-in-odisha/articleshow/76762804.cms

No comments