Breaking News

హాట్ హాట్ గా తేజస్వి కమిట్మెంట్..


తేజస్వి మాదివాడ తెలుగు సినిమాల్లో హీరోయిన్ పక్కన చిన్న చిన్న పాత్రల్లో మెరిసి, ఆ తర్వాత హీరోయిన్ గా మారినా సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కానీ బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా వచ్చిన తేజస్వి చాలా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటున్న తేజస్వి, హాట్ హాట్ ఫోటోలని షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని బాగానే పెంచుకుంది. అయితే తాజాగా తేజస్వి హీరోయిన్ గా నటిస్తున్న సినిమా నుండి లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చింది.

కమిట్మెంట్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు ఉన్నారు. తేజస్వి మాదివాడ, రమ్య పసుపులేటి, సిమర్ సింగ్ ఇంకా అన్వేషి జైన్ ప్రధాన పాత్రలుగా రూపొందుతున్న ఈ సినిమా, సినీ రంగంలో అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలకి ఎదురయ్యే అనుభవాలని చూపించనుందట. వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమా పరిశ్రమలోని హీరోయిన్ల జీవితంలో జరిగిన వాటిని చూపించబోతున్నారు. అయితే ఈ సినిమాలో ఒకానోక పాత్రలో తేజస్వి నటిస్తుంది. 

నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా కమిట్మెంట్ చిత్రం నుండి పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్ లో తేజస్వి చాలా హాట్ గా కనిపిస్తుంది. నలుపురంగు బికినీలో అందాలను ఎక్స్ పోస్ చేస్తూ హీటెక్కిస్తుంది. పోస్టర్ ని చూస్తుంటే సినిమా ఎంత బోల్డ్ గా ఉండనుందో అర్థం అవుతుంది. మరి ఈ సినిమాతోనైనా తేజస్వి హిట్ అందుకుంటుందేమో చూడాలి. లక్ష్మీకాంత్ చెన్నాదర్శకత్వం వహిస్తున్న కమిట్మెంట్ టీజర్ మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది.



By July 03, 2020 at 08:42PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/51689/commitment.html

No comments