జీ20 సదస్సు.. మోదీ సీటు వద్ద ‘భారత్’ నేమ్ ప్లేట్.. పేరు మార్పు తథ్యం!

అతిరథ మహారథుల రాక.. అత్యంత కట్టుదిట్టమైన భద్రతల మధ్య ప్రపంచానికి దిశానిర్దేశం చేసే రెండు రోజుల జీ20 సదస్సు శనివారం ప్రారంభమైంది. అంగరంగ వైభవంగా తీర్చిదిద్దిన ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. భారత్ తొలిసారిగా ఆతిథ్యమిస్తున్న ఈ సదస్సుపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సమావేశానికి వచ్చిన అతిథులను ప్రధాని నరేంద్ర మోదీ.. సాదరంగా స్వాగతించారు. వేదిక వద్ద అశోక చక్రం గురించి జో బైడెన్‌కు వివరించారు.
By September 09, 2023 at 12:24PM
By September 09, 2023 at 12:24PM
No comments