Breaking News

సాయి ధరమ్ తేజ్ బైక్ నాదే.. ప్రమాదం అలా జరిగిందంటూ సాక్రి ఫైజ్ స్టార్ సంచలనం


సాక్రిఫైజ్ స్టార్ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆ మధ్యకాలంలో ఓ ఇంటర్వ్యూలో నోటికొచ్చినట్లు మాట్లాడి ఓవర్ సైట్ ఫేమస్ అయ్యాడు సునిశిత్. ఇండస్ట్రీలో తనను ఎదగనివ్వకుండా ఎన్టీఆర్‌, మహేశ్ బాబు వంటి స్టార్స్ తొక్కేశారని సెన్సెషనల్ కామెంట్స్ చేశాడు. తాను వదులుకోవడం వల్లే వీరికి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయంటూ ఇతను అనడంతో నెటిజన్లు సాక్రిఫైజ్ స్టార్ అంటూ బిరుదు ఇచ్చారు. అయితే ఇండస్ట్రీలో ఎలాంటి సంఘటన జరిగిన అందులో తన ప్రమేయం ఉంది అంటూ.. ఏదో వీడియోలు విడుదల చేస్తూ దాని ద్వారా సంచలనం సృష్టించే ప్రయత్నం చేస్తూంటాడు సునిశిత్. అయితే కొద్ది రోజుల క్రితం సుప్రీం హీరో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఐకియా-కేబుల్‌బ్రిడ్జ్ దాటిన త‌ర్వాత మైండ్‌స్పేస్ జంక్ష‌న్ ప్రాంతంలో సాయితేజ్ ప్ర‌యాణిస్తున్న బైక్ స్కిడ్ అయ్యింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అక్కడ ఉన్నవాళ్లు ఆయన్ని మెడికోవర్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి నుంచి మెరుగై వైద్యం కోసం అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన కాలర్ బోన్ విరిగినట్లు గుర్తించిన వైద్యులు ఆయనకు విజయవంతంగా శస్త చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. అయితే ఈ ఘటనని కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నాడు సునిశిత్. ఇప్పటి వరకూ ఏ జర్నలిస్ట్ కానీ, ఏ రిపోర్టర్ కానీ చెప్పని కొన్ని విషయాలను చెబుతాను అంటూ అతను ఓ వీడియో విడుదల చేశారు. మీడియాలో ఇసుక ఉండటం వల్లే బైక్ స్కిడ్ అయిందని చూపిస్తున్నారు.. కానీ, బైక్‌లో యాక్షన్ కంట్రోల్ అనే ఓ ఆప్షన్ ఉంటుందని అందుకే టైర్ ఎక్కువగా తిరిగి బైక్ స్కిడ్ అయిందని అతను పేర్కొన్నాడు. అయితే సాయి ధరమ్ తేజ్ తనకు మంచి మిత్రుడు అని.. అతనికి ఆ బైక్ కానుకగా ఇచ్చాడు అంటూ అతను వెల్లడించాడు. అయితే దాని మెయిన్‌టేనెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల తనకు మళ్లీ ఆ బైక్‌ను సాయి ధరమ్‌కు రిటర్న్ ఇచ్చాను అని.. దీంతో మళ్లీ సాయి దాన్ని వాడటం ప్రారంభించాను అంటూ ఆ వీడియోలో సునిశిత్ పేర్కొన్నాడు. అయితే ఈ వీడియోలో అతను బైక్ నెంబర్‌ని కూడా చెప్పడం విశేషం. ఇకపోతే దీనిపై మెగా అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘అసలు నువ్వు ఎవడ్రా’ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా.. ‘ఒక వ్యక్తి గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే.. దాన్ని కూడా నీ పాపులారిటీకి వాడుకుంటున్నావా’ అంటూ మరికొందరు మండిపడుతున్నారు. ఇంకొందు అయితే.. ‘బైక్ నెంబర్ నీకు అంత గుర్తు ఉంటే పైకి ఎందుకు చూసి చెబుతున్నావు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


By September 18, 2021 at 12:56PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sacrifice-star-sensational-comments-on-sai-dharam-tej-accident/articleshow/86314897.cms

No comments