HappyBirthdayKajal.. మలుపుతిప్పిన ‘మగధీర’.. నెంబర్ వన్ హీరోయిన్‌గా హవా!
అందాల చందమామ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కెరీర్ ప్రారంభంలో సక్సెస్ ఎంతో పరితపించారు. హిందీలో నటి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆమెకంటూ ఓ గుర్తింపును స్థాయిని ఇచ్చింది మాత్రం తెలుగు చిత్రసీమే. ఇక్కడి ఆమె అభిమాన గణమే. అలా లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. కానీ తేజ తెరకెక్కించిన ఆ చిత్రం అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఆ తరువాత ఆటాడిస్తా, చందమామ వంటి సినిమాలు వచ్చాయి. అలా అలా కెరీర్ ముందుకు సాగుతూ వెళ్లింది. చందమామ సినిమా హిట్ అవ్వడంతో కాజల్ పేరు అందరికీ తెలిసింది. అయితే ఆమె కెరీర్‌ను మాత్రం మలుపుతిప్పింది మగధీర సినిమాయే. రాజమౌళి అద్భుత సృష్టిలో మిత్రవిందా పాత్రలో కాజల్ కనిపించి మైమరిపించారు. నిజంగానే యువరాణి అంటే ఇలానే ఉండాలనేలా కాజల్ ఆకట్టుకున్నారు. అలా కాజల్‌కు స్టార్ హోదాను కట్టబెట్టింది మగధీర. ఆ చిత్రం తరువాత మళ్లీ కాజల్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. మగధీర తరువాత టాలీవుడ్ దర్శక నిర్మాతలకు కాజల్ గోల్డెన్ హ్యాండ్‌గా మారిపోయారు. ప్రతీ ఒక్క హీరో కాజల్‌నే కోరుకున్నారు. అలా వరుసగా కాజల్‌కు ఆఫర్లు వెల్లువెత్తాయి. టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా కాజల్ కొన్నేళ్లు దూసుకుపోయారు. డార్లింగ్, బృందావనం, ఆర్య 2, మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అంటూ ఇలా టాలీవుడ్‌ను ఏలేశారు. మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి, అల్లు అర్జున్ ఇలా స్టార్ హీరోలందరినీ కాజల్ కవర్ చేసేశారు. ఇక కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ కాజల్ మెప్పించారు. అయితే బాలీవుడ్‌లో మాత్రం అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయారు. కుర్ర హీరోయిన్లు దూసుకుపోతున్నా కూడా కాజల్ మాత్రం తన ఉనికిని చాటుకున్నారు. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరి పక్కనా నటించేస్తున్నారు. ప్రస్తుతం కాజల్ వెబ్ సిరీస్‌లతోనూ హల్చల్ చేస్తున్నారు. పెళ్లి తరువాత కూడా నటించేస్తానని కాజల్ ముందే చెప్పారు. అందుకు తగ్గట్టుగానే మంచి ప్లానింగ్ వేసుకున్నారు. కాజల్ చేతిలో టాలీవుడ్ నుంచి ఇప్పుడు చిరంజీవి ఆచార్య సినిమా మాత్రమే ఉందని తెలుస్తోంది.
By June 19, 2021 at 09:25AM
No comments