Breaking News

రాబోయే 6 నుంచి 8 వారాల్లో థర్డ్ వేవ్.. AIIMS Director సంచలన వ్యాఖ్యలు


కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి నుంచి ఇప్పడిప్పుడే బయటపడుతున్న భారత్‌‌ను భయపెడుతోంది. రాబోయే ఆరు నుంచి ఎనిమిది వారాల్లోనే దేశంలో మూడో దశ వ్యాప్తి మొదలయ్యే అవకాశం ఉందని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా శనివారం ఉదయం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో చాలా రాష్ట్రాలు కోవిడ్ లాక్‌డౌన్ ఆంక్షలు సడలించాయి. ఆర్ధిక కార్యాకలాపాలు ప్రారంభం కావడంతో మరోసారి కేసులు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ‘‘అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభిండంతో మళ్ళీ కోవిడ్ వ్యాప్తి మొదలయ్యింది.. మొదటి, రెండో దశల్లో ఏమి జరిగిందో ఆకళింపు చేసుకున్నట్టు లేదు. మళ్లీ జనం గుమిగూడుతున్నారు.. ఇది కేసుల సంఖ్య జాతీయ స్థాయిలో పెరగడానికి కొంత సమయం పడుతుంది... కానీ, వచ్చే ఆరు నుంచి ఎనిమిది వారాల్లో జరగవచ్చు లేదా... కొంచెం ఎక్కువ సమయం పట్టొచ్చు.. ఇవన్నీ కోవిడ్ వ్యాప్తి, జన సమూహాన్ని నివారించడం పరంగా మనం ఎలా ముందుకు వెళ్తామో దానిపై ఆధారపడి ఉంటాయి’’ అని అన్నారు. సెకెండ్ వేవ్‌లో దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరత ఎదురయ్యింది. ఆక్సిజన్ అందక వందల మంది చనిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. భారత్‌లోని దుర్బర పరిస్థితికి చలించిపోయిన పలు దేశాలు తమ వంతు సాయం అందజేశాయి. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో చాలా రాష్ట్రాలు కోవిడ్ లాక్‌డౌన్ ఆంక్షలు సడలించాయి. అయితే, మూడో దశ వ్యాప్తిని ఎదుర్కొడానికి సిద్ధంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపుతుందనే అంచనాలతో వారి కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేస్తున్నాయి. కాగా, మ‌రో రెండు వారాల నుంచి నాలుగు వారాల్లో థ‌ర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంద‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ హెచ్చ‌రించినట్టు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. సెకండ్ వేవ్‌కు మించిన రెట్టింపు కేసులు కేసులు న‌మోద‌వుతాయ‌ని అంచ‌నా వేసిందని, యాక్టివ్ కేసులు 8 ల‌క్ష‌ల‌కు చేరుతాయ‌ని పేర్కొంది. క‌రోనా క‌ట్ట‌డికి చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మీక్షా స‌మావేశంలో అంచ‌నాలు వెల్ల‌డించినట్టు జరుగుతున్న ప్రచారాన్ని మహారాష్ట్ర కోవిడ్ టాస్క్‌ఫోర్స్ మాత్రం ఖండించింది.


By June 19, 2021 at 09:34AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/foresee-a-third-wave-in-next-6-to-8-weeks-aiims-chief-randeep-guleria/articleshow/83658160.cms

No comments