మరో మహిళతో భర్త అఫైర్.. మామిడి తోటలో శవమై కనిపించిన భార్య

పరాయి మహిళతో పెట్టుకున్న భర్త తనను వేధిస్తుండటాన్ని తట్టుకోలేకపోయిన వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన గ్రామీణ మండలంలోని గాజులపల్లిలో బుధవారం జరిగింది. గాజులపల్లికి చెందిన వినోద్‌కు, బంధువుల అమ్మాయి రేవతి(24)తో మూడేళ్ల క్రితం వివాహమైంది. ఇటీవల వినోద్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రేవతి భర్తను నిలదీయడంతో వేధింపులకు గురిచేస్తున్నాడు. తాను ప్రియురాలితోనే ఉంటానని, నీకంటే ప్రియురాలే నాకు ఎక్కువ అని తేల్చి చెప్పాడు. Also Read: ఈ క్రమంలోనే మంగళవారం దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన రేవతి పుట్టింటికి వెళ్లిపోయింది. బుధవారం గ్రామంలోని ఓ మామిడి తోటలో చీరతోనే ఉరేసుకున్న స్థితిలో రేవతిని గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. రేవతిని భర్తే మామిడితోటకు పిలిపించి ఉరేసి చంపేశాడని ఆరోపిస్తూ చిత్తూరు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:
By September 03, 2020 at 11:32AM
No comments