Breaking News

అడవి పంది దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాలిక.. చర్లలో విషాదం


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విప్పపూవు సేకరణకు వెళ్లిన ఓ బాలిక దాడిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన చర్ల మండలం మారుమూల పూసుగుప్పలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సోడి గణపతి కుమార్తె కవిత(14), మరో ఇద్దరు బాలురతో కలిసి బుధవారం సమీపంలోని అటవీ ప్రాంతానికి విప్పపూవు సేకరణకు వెళ్లింది. ఈ సమయంలో వెనక నుంచి వచ్చి ఓ అడవి పంది ఒక్కసారిగా కవితపై దాడి చేసింది. పక్కన ఉన్న బాలురు దానిపై రాళ్లు విసరడంతో అడవి పంది పారిపోయింది. Also Read: ఛాతి, కాళ్లు, చేతులపై తీవ్ర గాయాలైన బాలికను ఇద్దరు బాలురు ఓ యువకుడి సాయంతో గ్రామానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న చర్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే కవిత చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. బాలికపై దాడిచేసే సమయానికే అడవి పందికి బాణం గుచ్చుకొని ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బాలిక కుటుంబానికి రూ.5లక్షల పరిహారం చెల్లించాలని అటవీ సంరక్షణ అధికారి శోభ జిల్లా అధికారులను ఆదేశించారు. Also Read:


By April 16, 2020 at 08:14AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/14-yr-old-tribal-girl-killed-by-wild-pig-in-telangana/articleshow/75171915.cms

No comments