Breaking News

అన్నవరం: అల్లుడి తల నరికేసిన మామ... అసలు కారణం అదే


జిల్లాలో పిల్లనిచ్చిన మామే అల్లుడిని తల నరికి చంపిన ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తనకు రెండో పెళ్లి చేయకపోతే ఇద్దరు పిల్లలను చంపేస్తానని బెదిరించడంతో అల్లుడిని మామ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. రౌతులపూడి మండలం ధార జగన్నాథపురం గ్రామానికి చెందిన పల్లా సత్యనారాయణ తన కుమార్తెను శంఖవరం మండలం గొంది అచ్చింపేటకు చెందిన పంపనబోయిన లచ్చబాబుకు ఇచ్చి 2015లో వివాహం చేశాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు(4, 2ఏళ్లు) ఉన్నారు. సత్యనారాయణ కుమార్తె 10 నెలల క్రితం అత్తింట్లో ఉరేసుకుని చనిపోయింది. Also Read: దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు లచ్చబాబు పెద్దల సమక్షంలో తన ఇద్దరు పిల్లల పేరిట 40 సెంట్ల భూమిని రాసిచ్చాడు. అప్పటి నుంచి పిల్లలిద్దరూ అమ్మమ్మ, తాత ఇంట్లోనే ఉంటున్నారు. అయితే తన కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని, అల్లుడే చంపేసి ఉంటాడని సత్యనారాయణకు ఎప్పటి నుంచో అనుమానం ఉంది. ఈ క్రమంలోనే తన కుమార్తె చనిపోయిన తర్వాత అల్లుడికి కొత్త దుస్తులు పెట్టాలని చెప్పి ఈ నెల 8న లచ్చబాబును ఇంటికి తీసుకొచ్చాడు. ఆ రోజు రాత్రి ఇద్దరూ మద్యం తాగి పడుకున్నారు. ఆదివారం ఉదయం నిద్రలేచిన తర్వాత పిల్లలను బాగోగులు చూసుకోకుండా ఎందుకు తమ ఇంటి వద్దే వదిలేశావని, తాము వృద్ధాప్యంలో ఉన్నామని సత్యనారాయణ అల్లుడితో చెప్పాడు. Also Read: అయితే పిల్లలను తాను చూడటానికి ఇంట్లో ఆడదిక్కు లేదని, మీ బంధువుల్లో ఎవరో ఒకరిని తనకిచ్చి పెళ్లి చేస్తే పిల్లలను చూస్తానని లచ్చబాబు మామతో చెప్పాడు. ఒక పిల్లను ఇస్తేనే దాని చావుకు కారణమయ్యాం, మరో పిల్లనిచ్చి ఆ తప్పు మరోసారి చేయం.. అని వారు మామ అనడంతో వివాదం మొదలైంది. దీంతో రెచ్చిపోయిన లచ్చబాబు తనకు మరో పెళ్లి చేయకపోతే ఇద్దరు పిల్లలను చంపేస్తానని బెదిరించాడు. దీంతో కోపోద్రిక్తుడైన సత్యనారాయణ కత్తితో లచ్చబాబు తల నరికేశాడు. అల్లుడి తలతో నేరుగా పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. Also Read:


By August 11, 2020 at 10:01AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/old-man-arrested-for-kills-son-in-law-in-east-godavari-district/articleshow/77476766.cms

No comments