Breaking News

ఛార్జింగ్ పెడుతుండగా పేలిన సెల్‌ఫోన్.. తల్లి, ఇద్దరు చిన్నారుల మృతి


ఫోన్ ఛార్జింగ్ పెట్టిన సమయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తుంటారు. ఛార్జింగ్‌ ఎక్కుతుండగా ఫోన్ మాట్లాడకూడదని, దాన్ని ఓ కంట కనిపెట్టుకుని ఉండాలని చెబుతుంటారు. వారు అలా ఎందుకు చెబుతారో, ఏదైనా జరగరానిది జరిగితే ఎంత విషాదం నింపుతుందో ఈ ఘటనతో ప్రత్యక్ష సాక్ష్యం. ఛార్జింగ్‌ పెట్టినప్పుడు షార్ట్‌సర్క్యూట్‌ అయి ఫోన్‌ పేలిపోయిన ఘటనలో పొగతో ఊపిరాడక తల్లి, ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులో జరిగింది. Also Read: కరూర్‌ జిల్లా రాయనూర్‌ ప్రాంతంలోని రామ్‌నగర్‌లో బాలకృష్ణన్‌(30), ముత్తులక్ష్మి(29) దంపతులు నివాసముంటున్నారు. వీరికి రక్షిత్‌(3), తక్షిత్‌(2) అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. కరూర్‌ పరమత్తిలో బేకరీ నిర్వహించే బాలకృష్ణన్‌ అప్పుల పాలై కుటుంబాన్ని వదిలి ఎక్కడికో వెళ్లిపోయాడు. దీంతో ముత్తులక్ష్మి పిల్లలతో కలిసి పుట్టింటిలో ఉంటోంది. ఆదివారం ముత్తులక్ష్మి తల్లిదండ్రులు పని మీద వేరే ఊరికి వెళ్లారు. సోమవారం ఉదయం ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు. Also Read: అగ్నిమాపక సిబ్బంది తలుపులు పగలకొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టిన చోట ముత్తులక్ష్మి మృతదేహం కాలిపోయిన స్థితిలో కనిపించింది. మరో గదిలో నిద్రిస్తున్న రక్షిత్‌, తక్షిత్‌ విగతజీవులుగా పడి ఉన్నారు. ఆదివారం రాత్రి ఛార్జింగ్‌ పెట్టినప్పుడు ఫోన్‌ పేలి ముత్తులక్ష్మి చనిపోయిందని, పొగ కారణంగా ఊపిరాడక పిల్లలు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. Also Read:


By August 11, 2020 at 10:20AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-woman-and-two-child-death-due-to-cellphone-blast-in-tamil-nadu/articleshow/77477066.cms

No comments