70ఏళ్ల తల్లిపై నడిరోడ్డుపై దాడి.. ఫించన్ డబ్బుల కోసం కొడుకు కిరాతకం
తల్లికి ప్రభుత్వం ఇచ్చే నడిరోడ్డుపైనే వృద్ధాప్య ఫించన్ కోసం ఓ కొడుకు దారుణానికి పాల్పడ్డాడు. నవ మాసాలు మోసి, కని పెంచిన తల్లిపై నడిరోడ్డుపై దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌లో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండకు చెందిన అరుణ(70)కు ముగ్గురు కుమారులు. వృత్తి రీత్యా భర్త వరంగల్‌లో ఉంటున్నాడు. ఇద్దరు కుమారులు స్వగ్రామంలో ఉంటుండగా, ఆమె బల్కంపేటలో మూడో కుమారుడితో కలిసి ఉంటోంది. Also Read: ప్రతి నెలా వచ్చే వృద్ధాప్య పింఛను డబ్బు తీసుకునేందుకు శనివారం కుమారుడు తల్లిని తన బైక్ ఎక్కించుకుని ఎస్సార్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్దకు వెళ్లాడు. పింఛన్ సొమ్ము తనకు ఇవ్వాలని కోరగా.. ఖర్చుల కోసం తన వద్దే ఉంచుకుంటానని అరుణ చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన కొడుకు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆమెపై దాడిచేశారు. ఈ ఘటనను చూసి చలించిపోయిన స్థానికులు అడ్డు పడగా వారిని దూషిస్తూ దాడికి యత్నించాడు. దీంతో వారందరూ గుమిగూడటంతో భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. Also Read: స్థానికులు బాధితురాలికి సమప్యలు చేసి భోజనం పెట్టారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సార్ నగర్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. వృద్ధురాలికి ప్రథమ చికిత్స చేయించి కుమారుడి ఇంటి వద్ద దించారు. వృద్ధురాలి కుమారుడిని స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామని పోలీసులు తెలిపారు. Also Read:
By July 05, 2020 at 07:36AM
No comments