Breaking News

Ala Vaikunthapurramloo: అల్లు అర్జున్ రికార్డుల ప్రభంజనం.. మరో మైల్‌స్టోన్ దాటేసి వరల్డ్ రికార్డ్


అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొంది ఈ ఏడాది ఆరంభంలోనే తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది '' మూవీ. కెరీర్ లోనే భారీ విజయం సాధించి కలెక్షన్ల సునామీ సృష్టించింది. అయితే ఇదంతా ఒకెత్తయితే.. ఈ మూవీ పాటలు, తమన్ అందించిన బాణీలు మరో ఎత్తయ్యాయి. నేటికీ ఎక్కడ చూసినా అవే పాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని 'బుట్టబొమ్మ', 'రాములో.. రాముల' ఈ రెండు పాటల హవాను బ్రేకులేసే సాంగ్ మరోటి రాలేదు. దీంతో వ్యూస్ పరంగా దూసుకుపోతూ సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి ఈ రెండు సాంగ్స్. కాగా తాజాగా 'బుట్టబొమ్మ' సాంగ్ 250 మిలియన్స్ మైల్‌స్టోన్ దాటేసి వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది. ఇప్పటిదాకా చూస్తే 'బుట్టబొమ్మ' సాంగ్ యూట్యూబ్‌లో 250 మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసి పరుగులు పెడుతోంది. మరోవైపు ఎందరో సెలబ్రిటీలు ఈ సాంగ్‌పై స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఈ హవా చూసి బన్నీ అభిమానులు ఖుషీ అవుతున్నారు. 'అల.. వైకుంఠపురములో' మూవీ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా 'పుష్ప'. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో బన్నీ మాస్ కిక్ ఇవ్వనున్నారు. చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.


By July 05, 2020 at 08:07AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/butta-bomma-song-creates-world-record-from-ala-vaikunthapurramloo/articleshow/76792847.cms

No comments