కాపురానికి రావడం లేదని భార్యను తెగనరికిన భర్త.. అడ్డొచ్చిన అత్తను కూడా
కాపురానికి వచ్చేందుకు ఇష్టపడని భార్యపై కత్తితో దాడికి పాల్పడ్డాడో భర్త. అడ్డుపడిన అత్తను సైతం కత్తితో నరికడంతో ఆమె కూడా తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో జరిగింది. మండలం మామిడిగొందికి చెందిన మాడే శివరామ్‌కు రామన్నపాలెం గ్రామానికి చెందిన తుట్టి పోశమ్మతో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. మే 31న కుమారుడు ప్రమాదంలో గాయపడటంతో పోశమ్మ అతడిని తీసుకెళ్లి పుట్టింటికి వెళ్లి అక్కడే చికిత్స అందిస్తోంది. తన దగ్గరికి వచ్చేయాలని శివరామ్ ఎన్నిసార్లు కోరినా ఆమె కుమారుడికి పూర్తిగా నయం అయ్యేవరకు రానని చెప్తూ వస్తోంది. Also Read: శనివారం రామన్నపాలెంకు వచ్చన శివరామ్ కాపురానికి రావాలని భార్యను ఒత్తిడి చేశాడు. తాను రానని ఆమె చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశానికి గురైన శివరామ్ తన బైక్‌లో ఉన్న కత్తి తీసుకుని భార్యపై దాడికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో పోశమ్మ కేకలు వేయగా తల్లి అడ్డొచ్చింది. దీంతో శివరామ్ ఆమెపైనా దాడి చేసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన తల్లీకూతుళ్లను స్థానికులు హుటాహుటిన పోలవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం వారి పరిస్థితి నిలకడగానే ఉందని, ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. పోశమ్మ ఫిర్యాదుతో పోలీసులు శివరామ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By June 29, 2020 at 09:06AM
No comments