Breaking News

మహిళపై మంత్రగాడి అత్యాచారం.. భర్తే దగ్గరుండి మరీ గదిలోకి పంపి


నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేస్తానని నమ్మించి ఓ మంత్రగాడు వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మల్కాజిగిరి పోలీస్‌‌స్టేషన్‌ పరిధిలోని మౌలాలిలో నివాసముంటున్న దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. ఇటీవల వారికి ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవడంతో భర్త నిజామాబాద్‌కు చెందిన మహ్మద్‌ యూనిస్‌ఖాన్‌ అలియాస్‌ ముష్రద్‌ (50) అనే మంత్రగాడిని సంప్రదించాడు. Also Read: అతడి బలహీనతను అలుసుగా తీసుకున్న మంత్రగాడు ‘నీ ఆర్థిక ఇబ్బందులకు కారణం నీ భార్యే. ఆమెకు దెయ్యం పట్టింది. నా దగ్గరకు తీసుకొస్తే వదిలిస్తాను’ అని మాయమాటలు చెప్పాడు. ఇందుకు ఒప్పుకున్న భర్త భార్యను వెంటబెట్టుకొచ్చి మంత్రగాడి ఇంట్లో వదిలేసి వెళ్లిపోయాడు. మంత్రగాడు ఏం చెప్పినా చెయ్యాలని భార్యను హెచ్చరించాడు. ఆమెను గదిలోకి తీసుకెళ్లిన మంత్రగాడు కాసేపు పూజలు చేస్తున్నట్టు నటించి ఆ తర్వాత బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. Also Read: కాసేపటి తర్వాత అక్కడికి వచ్చిన భర్త ఏమీ ఎరుగనట్లు బాధితురాలిని తీసుకుని వెళ్లిపోయాడు. ఇంటికెళ్లాక తనపై మంత్రగాడు అత్యాచారానికి పాల్పడినట్లు భర్తకు చెప్పగా అతడు పట్టించుకోలేదు. నీ వల్లే నాకు ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి, ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పావో ప్రాణం తీస్తానంటూ బెదిరించాడు. దీంతో కుమిలిపోయిన బాధితురాలు మల్కాజ్‌గిరి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం మంత్రగాడితో పాటు బాధితురాలి భర్తను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:


By June 29, 2020 at 09:10AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/wizard-rapes-woman-with-help-of-her-husband-in-hyderabad/articleshow/76682216.cms

No comments