భారతీయులను తీసుకొచ్చేందుకు భారీ ఆపరేషన్.. లక్ష వరకు ఛార్జీలు, నిబంధనలివే
కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో వివిధ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు చిక్కుకుపోయారు. వివిధ దేశాల్లో సుమారు కోటి నలభై లక్షల మంది భారతీయులు ఉంటున్నట్లు అంచనా. వీరిని స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఆపరేషన్ చేపట్టింది. మే 7 నుంచి ఈ ప్రక్రియ చేపట్టనుంది. ఇందు కోసం ప్రత్యేక విమానాలను, నౌకలను సిద్ధం చేస్తోంది. విమానాల ద్వారా భారతీయుల తరలింపును ‘వందే భారత్ మిషన్’గా, ఓడల ద్వారా తరలింపును ‘సముద్ర సేతు’ ఆపరేషన్‌గా పేర్కొంటోంది. ఈ తరలింపు కోసం ఎయిర్ ఇండియా 64 విమానాలను నడుపుతోంది. తరలింపు ఛార్జీలు కాస్త ఎక్కువగానే నిర్ణయించడం విమర్శలకు తావిస్తోంది. భారతీయులను స్వదేశానికి తరలించడానికి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం ఇదే సమయంలో ట్విస్టు ఇచ్చింది. ఈ సేవలను ఉపయోగించుకోదలచిన వారు ప్రయాణానికి సంబంధించిన ఛార్జీలను సొంతంగా భరించాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా విదేశాల నుంచి వచ్చే భారతీయులంతా సొంత రిస్కుకు లోబడే ప్రయాణానికి సిద్ధమైనట్లు లేఖ ఇవ్వాలని కేంద్ర హోంశాఖ పేర్కొంది. సముద్ర సేతు: రంగంలోకి ఇండియన్ నేవీ.. ఓడల ద్వారా భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియలో భారత నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకలు కూడా పాల్పంచుకోనున్నాయి. భారత్ ఇందు కోసం 3 యుద్ధ నౌకలను రంగంలోకి దించింది. మే 8 నుంచి మొదటి దశ తరలింపు ప్రక్రియ మొదలుకానుంది. మాల్దీవులకు ‘ఐఎన్‌ఎస్ జలాశ్వ’, ‘ఐఎన్‌ఎస్ మగర్’ యుద్ధనౌకలను ఇండియన్ నేవీ ఇప్పటికే పంపించింది. మే 13 వరకూ సాగే మొదటి విడత కార్యక్రమంలో ఎయిర్ ఇండియా 12 దేశాల్లోని దాదాపు 15 వేల మంది భారతీయులను తరలించనుంది. ఇందు కోసం నాన్ షెడ్యూల్డ్ వాణిజ్య విమాన సర్వీసులను నడుపుతుంది. మే 13 తర్వాత ఈ ప్రక్రియలో ప్రైవేట్ విమానయాన సంస్థలకు కూడా పాలుపంచుకునే అవకాశం ఉంది. అవసరమైతే.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానాలను కూడా ఇందు కోసం వినియోగించుకోనున్నారు. భారత వైమానిక దళం తన సి-17 గ్లోబ్‌మాస్టర్, సి-130జె సూపర్ హెర్క్యులెస్ సహా సుమారు 30 విమానాలను సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది. విమానాల్లో తరలింపు ఛార్జీలు ఇలా.. * అమెరికాలోని నెవార్క్, షికాగో, శాన్ ఫ్రాన్సిస్కో తదితర ప్రాంతాల నుంచి ఢిల్లీకి విమాన సర్వీస్‌కు టికెట్ ధరను లక్ష రూపాయల వరకు నిర్ణయించారు. * లండన్ - ఢిల్లీ విమాన సర్వీసులో ఒక్కో ప్రయాణికుడు రూ.50 వేలు చెల్లించాల్సి ఉంది. * కువైట్ - హైదరాబాద్ విమాన సర్వీసు వినియోగించుకునేవారు రూ.20 వేలు చెల్లించాలి. * ఢాకా - ఢిల్లీ విమాన సర్వీసులో రూ.12 వేలు చెల్లించాలి. Must Read: గల్ఫ్ ప్రాంతానికే ప్రాధాన్యం.. సుమారు 1.4 కోట్ల మంది భారతీయులు వివిధ దేశాల్లో ఉంటున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నా.. వీరిలో ఎంత మంది తిరిగి ఇండియాకు రావాలనుకుంటున్నారో తెలియాల్సి ఉంది. వందే భారత్ ఆపరేషన్‌లో గల్ఫ్ ప్రాంతం నుంచే ఎక్కువగా భారతీయులు తరలివచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ఇప్పటికే 3 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తొలి విమానాన్ని అబుదాబికి పంపించనున్నారు. ఈ విమానం దాదాపు 200 మంది ప్రయాణికులను కేరళలోని కోచికి తీసుకొస్తుంది. తొలి రోజున ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి 10 విమానాలను నడుపనున్నారు. ఇటు భారత్‌లో చిక్కుకుపోయిన విదేశీయులు వారి స్వస్థలాలకు వెళ్లడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆయా దేశాల పౌరులు, కనీసం ఏడాది గడువున్న వీసా, గ్రీన్‌కార్డు, ఓసీఐ కార్డుదారులను మాత్రమే వెళ్లడానికి అవకాశం ఇవ్వనుంది. ఓసీఐ కార్డుదారులకు ఇచ్చిన బహుళ ప్రవేశ వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రకటించింది. భారతీయుల తరలింపునకు సంబంధించిన నిబంధనలు: * తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న వారికే ‘వందే భారత్ మిషన్’లో తొలి ప్రాధాన్యం. * ఉద్యోగాల తొలగింపు ప్రకటనలతో ఇబ్బందుల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, కూలీలు, వీసా ముగిసిపోయేవాళ్లు, స్వల్పకాల వీసాలున్నవారిని తరలించడానికి తొలి ప్రాధాన్యం. * వైద్యపరమైన ఇబ్బందులు ఉన్నవారు, గర్భిణులు, వయోవృద్ధులు, కుటుంబ సభ్యులు, బంధువుల మరణం కారణంగా స్వదేశానికి రావాలనుకుంటున్నవారు, విద్యార్థులకు తొలి ప్రాధాన్యం. * స్వదేశానికి రావాలనుకుంటున్నవారు తప్పనిసరిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ప్రయాణికులు కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలను ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం అందించనుంది * భారత్‌కు చేరుకున్న తర్వాత కచ్చితంగా 14 రోజులు తమ సొంత ఖర్చులతో నిర్దేశిత క్వారెంటైన్ కేంద్రంలో ఉంటామని ప్రయాణికులు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలి. అడుగుపెట్టగానే ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి! స్వదేశీ గడ్డపై అడుగుపెట్టగానే ప్రయాణికులు ‘ఆరోగ్య సేతు’ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని కేంద్ర హోం శాఖ మంగళవారం (మే 5) స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇక్కడికి చేరుకున్న తర్వాత తప్పనిసరిగా 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాలని నిర్దేశించింది. క్వారంటైన్ కోసం అయ్యే ఖర్చులను కూడా సొంతంగా భరించాలనే నిబంధన విధించడం గమనార్హం. Also Read:
By May 06, 2020 at 09:56AM
No comments