Breaking News

లాక్ డౌన్‌లో మద్యం అమ్మకాలు.. మండిపడ్డ కమల్


లాక్ డౌన్‌లో మద్యం అమ్మకాలు నిర్ణయంపై తీవ్ర విమర్శలు తలెతుతున్నాయి. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వాలు ఇన్నాళ్లు తీసుకున్న చర్యలు బూడిదలో పోసిన పన్నీరైందంటూ మండిపడుతున్నారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యాన్ని పక్కనపెట్టేసి.. ప్రభుత్వం ఆదాయ మార్గాల అన్వేషణలో భాగంగా మద్యం రేట్లు పెంపు, మద్యం దుకాణాల పున:ప్రారంభం లాంటి నిర్ణయాలు దారుణం అంటూ మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాల నిర్ణయాన్ని తప్పుపట్టారు స్టార్ హీరో . ఆదాయం కోసం మద్యం దుకాణాలను తిరిగి ప్రారంభించి ప్రజా ఆరోగ్యంతో ఆటలు ఆడుతున్నారంటూ మండి పడ్డారు కమల్ హాసన్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన లాక్ డౌన్‌లో మద్యం షాపులు తెరవడాన్ని తీవ్రంగా ఖండించారు. ఒకవైపు కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతుంటే.. నిబంధనలను మరింత కఠినం చేయాల్సింది పోయి.. మద్యం షాపులు తెరవడం దారుణమైన చర్య అన్నారు. దీని వలన తీవ్రపరిణామాలు చోటుచేసుకుంటాయని.. మద్యం షాపుల దగ్గర ప్రజలు గుమిగూడి భౌతిక దూరం పాటించే అవకాశం ఉండదన్నారు. దీనివల్ల ఆ వ్యక్తికే కాకుండా ఆ కుటుంబం మొత్తం కరోనా బారిన పడే అవకాశం ఉందన్నారు కమల్. వెంటనే తమిళనాడు ప్రభుత్వం మద్యం దుకాణాల నిర్ణయాన్ని విరమించుకోవాలని ఫైర్ అయ్యారు కమల్. మే 7 నుంచి తమిళనాడులో మద్యం దుకాణాలు తెరవబోతుండటంతో కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు.


By May 06, 2020 at 10:14AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actor-kamal-haasan-slams-tamil-nadu-govt-over-decision-to-re-open-liquor-stores/articleshow/75568407.cms

No comments