కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: చిన్నారుల్లో అంతుచిక్కని అనారోగ్యం
⍟ మహమ్మారి ఉద్ధృతి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. ఐరోపా దేశాలు సహా అమెరికాలోనూ విలయతాండవం చేస్తోంది. కొన్ని దేశాల్లో ఆంక్షలు సడలించడంతో మరోసారి వైరస్ విజృంభించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, నెదర్లాండ్‌లలో ప్రాణనష్టం భారీగా ఉంది. ⍟ కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఆశగా ఎదురుచూస్తోంది. మహమ్మారిని నిలువరించి, పోరులో విజయం సాధించాలంటే వ్యాక్సిన్ ఒక్కటే ఆయుధం. ఈ ఆయుధం కోసం ప్రపంచవ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి. ముందుగా వ్యాక్సిన్‌ను ఎవరు అభివృద్ధిచేసినా అందరి లక్ష్యం ఒక్కటే కాబట్టి.. ఎవరు శుభవార్త చెబుతారనే ఆసక్తి నెలకుంది. ⍟ దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. పాజిటివ్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరిగాయి. రెండో దశ లాక్‌డౌన్‌లో ఇచ్చిన మినహాయింపుల పుణ్యమో? లేదా మరేదైనా కారణమో? గడచిన 24 గంటల్లోనే దాదాపు 4వేల మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. దేశంలో మహమ్మారి మొదలైన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ⍟ కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆది నుంచి పకడ్బందీ చర్యలు చేపట్టాయి. వైద్యులు, వైద్య, ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలు పణంగా పెట్టి ఈ మహమ్మారితో పోరాడుతున్నారు. కరోనా పోరులో భారత్.. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ⍟ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి ఇక వ్యాక్సిన్‌ను ఎప్పటికీ చూడలేమా? ఈ ప్రశ్నకు లేకపోవచ్చనే సమాధానం చెబుతున్నారు నిపుణులు. ఇప్పటికీ అనేక దేశాల్లో 100కు పైగా వ్యాక్సిన్ పరిశోధనలు జరుగుతున్నా, వాటిలో రెండు మనుషులపై ప్రయోగాల దశకు చేరుకున్నా.. ఆశాజనక ఫలితాలైతే కనిపించడంలేదని చెబుతున్నారు. ⍟ రాష్ట్రంలో ఉన్న వలసదారులు, కార్మికులంతా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములని, వారికి కడుపులో పెట్టుకొని చూసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చారు. దాదాపు 7.5 లక్షల మంది కార్మికులకు లాక్ డౌన్ వల్ల రాష్ట్రంలో ఆశ్రయం కల్పించామని, తెల్లకార్డు దారులకు ఇచ్చినట్లే వారికి కూడా మనిషికి 12 కిలోల బియ్యం, రూ.1,500 ఇచ్చామని వెల్లడించారు. ⍟ తెలంగాణలో గ్రీన్ జోన్, రెడ్ జోన్, ఆరెంజ్ జోన్లతో సంబంధం లేకుండా అన్ని జిల్లాల్లో రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ పొడిగించిన మే 29 తేదీ వరకూ ఇది అమల్లో ఉంటుందని చెప్పారు. ⍟ కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్రం, రాష్ట్రాలు అనేక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని, బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వాలు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాయి. ⍟ గుంటూరు జిల్లాలో మానవత్వం మంటగలిసింది. అనారోగ్య కారణాలతో చనిపోయిన వ్యక్తికి.. కరోనా భయంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఇబ్బందులు తప్పలేదు. ఇలాంటి కష్టకాలంలో గ్రామ వాలంటీర్లు ముందుకొచ్చారు.. దగ్గరుండి వృద్ధుడి అంత్యక్రియలు జరిపించారు. ⍟ ఒవైపు కల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి.. వివిధ దేశాల్లో పిల్లలు అంతుచిక్కని అనారోగ్యానికి గురికావడం కలవరపరుస్తోంది. ఇటీవల బ్రిటన్‌లో ఇలాంటి కేసులు బయటపడగా.. తాజాగా న్యూయార్క్‌లోనూ 15 మంది చిన్నారులు ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో చాలామంది కరోనా బారిన పడినవారే. ‘మిస్టీరియస్ సిండ్రోమ్’గా చెబుతున్న వైద్యులు దీనిపై ఓ అంచనాకు రాలేకపోతున్నారు. పలు ఐరోపా దేశాల్లోనూ ఇలాంటి కేసులు బయటపడుతున్నాయి.
By May 06, 2020 at 09:54AM
No comments