భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం.. తండ్రి చేతిలో దారుణహత్య
అక్రమ సంబంధం మోజులో భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం చేస్తున్న కూతురిని ఓ తండ్రి అతికిరాతకంగా చంపేసిన ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. కుటుంబ పరువు తీసిందన్న ఆక్రోశంతో రక్తం పంచుకుని పుట్టిన కూతురి ప్రాణం తీశాడు. బళ్లారి తాలూకా గోడేహళ్ గ్రామానికి చెందిన గోపాలరెడ్డిది వ్యవసాయ కుటుంబం. అతడి కూతురు కవిత(22)కు నాలుగేళ్ల క్రితం సండూరు తాలూకా కురెకుప్ప గ్రామానికి చెందిన యువకుడికిచ్చి పెళ్లి చేశాడు. Also Read: కొద్దిరోజులు భర్తతో సవ్యంగానే కాపురం చేసిన కవిత తర్వాత ప్రకాశ్ అనే యువకుడితో ప్రేమలో పడింది. భర్త కళ్లుగప్పి అతడితో అక్రమ సంబంధం పెట్టుకుని రాసలీలలు కొనసాగించేది. ఈ విషయం భర్తకు తెలిసి పెద్దల మధ్య పంచాయతీ పెట్టాడు. అయితే భర్తతో సవ్యంగా కాపురం చేస్తానని చెప్పిన కవిత కొద్దిరోజుల తర్వాత కనిపించకుండా పోయింది. దీంతో భర్త, తల్లిదండ్రులు తోరణగల్లు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కవిత ప్రియుడితో సహజీవనం చేస్తోందని తెలిసి అందరూ షాకయ్యారు. Also Read: కుటుంబసభ్యులు ఆమెను పద్ధతిగా ఉండాలని కోరడంతో తల్లిదండ్రుల వెంట పుట్టింటికి వెళ్లింది. కొద్దిరోజుల తర్వాత కవిత వద్దకు వెళ్లిన ప్రకాశ్ తనతో వచ్చేయాలని ఆమెను బలవంతం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి ఆమె అక్రమ సంబంధం విషయం గ్రామంలో తెలిసిపోయింది. దీంతో తన కుటుంబ పరువు పోయిందని ఆవేదన చెందిన గోపాలరెడ్డి సోమవారం రాత్రి కూతురితో గొడవపడి ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గోపాలరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:
By February 12, 2020 at 11:21AM
No comments