Breaking News

కామారెడ్డిలో కామాంధుడు... యువతిపై ఆర్నెల్లుగా తండ్రి అత్యాచారం, గర్భం దాల్చడంతో


కన్నకూతురిని కంటికి రెప్పలా కాపాడాల్పిన తండ్రే ఆమెను కాటేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయి కూతురినే బెదిరించి ఆరు నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ దారుణ ఘటన తెలంగాణలోని జిల్లాలో జరిగింది. Also Read: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలానికి చెందిన ఓ వ్యక్తి వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతనికి భార్య, కూతురు(19), కొడుకు(15) ఉన్నారు. కుమార్తె టెన్త్ వరకు చదివి ఇంట్లోనే ఉంటోంది. దీంతో కన్నకూతురిపైనే ఆ కామాంధుడు కన్నేశాడు. రోజూ భార్య పొలం పనులకు, కొడుకు స్కూల్‌కి వెళ్లిన తర్వాత కూతురిని బెదిరించి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. దీంతో రాత్రివేళ భార్య, కొడుకు తినే ఆహారంలో మందు కలిపి వారు మత్తులోకి జారుకున్నాక కూతురిపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. ఈ విషయాన్ని బయటికి చెబితే అందరినీ చంపేస్తానని బెదిరించడంతో బాధితురాలు మౌనంగా బాధను భరిస్తూ వస్తోంది. Also Read: ఇటీవల కుమార్తెలో శారీరక మార్పులు గమనించిన తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా ఆమె రెండు నెలల గర్భవతి అని తేలింది. దీంతో కూతురిని నిలదీయగా తండ్రే తనపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడని చెప్పింది. దీంతో ఆమె భర్తను ప్రశ్నించగా నిజం ఒప్పుకున్నాడు. దీంతో ఆమె కూతురిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:


By February 12, 2020 at 11:49AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/kamareddy-man-arrested-over-rape-on-own-daughter/articleshow/74094427.cms

No comments