మహబూబ్‌బాద్‌లో యువతిపై గ్యాంగ్ రేప్.. నమ్మించి మామిడితోటలోకి తీసుకెళ్లి
రాష్ట్రంలో మరో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా బలరాంతండా గ్రామ పంచాయతీ పరిధిలో ఓ యువతిపై యువతిపై ఆరుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(24)కి మతిస్థిమితం సరిగ్గా లేదు. కొన్నాళ్ల క్రితమే తల్లి చనిపోవడంతో ఆమె బాగోగులు ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో అప్పుడప్పుడూ తండ్రికి చెప్పకుండా బయటకు వెళ్లిపోయేది. Also Read: ఈ క్రమంలోనే ఆమెకు ఆమనగల్లు ప్రాంతానికి చెందిన ఓ బాలుడు(16) పరిచయమయ్యాడు. క్యాటరింగ్ పనిచేసే అతడు ఆమెతో తరుచూ ఫోన్లో మాట్లాడేవాడు. కొద్దిరోజులుగా హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో ఉంటున్న యువతి శుక్రవారం ఇంటికి బయలుదేరింది. సికింద్రాబాద్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ఎక్కి బాలుడికి ఫోన్ చేసింది. దీంతో అతడు తనను కలిసేందుకు రావాలని కోరగా మహబూబాబాద్‌లో రైలు దిగి ఆటోలో రాత్రి 7గంటలకు ఆమనగల్‌కు వెళ్లింది. అక్కడ యువతిని కలుసుకున్న బాలుడు రాత్రి 8.30 గంటల సమయంలో మహబూబాబాద్-తొర్రూరు రహదారిలోని ఓ మామిడితోటలోకి ఆమెను తీసుకెళ్లి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. Also Read: తర్వాత తన స్నేహితులకు ఫోన్ చేయగా శ్రీకాంత్(18) అనే యువకుడితో పాటు మరో ఇద్దరు నలుగురు బాలురు మామిడితోటకు చేరుకుని ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు గమనించి తోట యజమానికి ఫోన చేశారు. అతడు అక్కడికి చేరుకోగా ఆయన్న చూసి ఆరుగురు కామాంధులు పరారయ్యారు. అయితే ఈ ఘటనపై స్థానికులు డయల్ 100కి ఫోన్ చెప్పడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని యువతిని ఆస్పత్రికి తరలించారు. ఆమె చెప్పిన వివరాలు, కాల్స్ డేటా ఆధారంగా ఐదుగురు మైనర్లను శనివారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న శ్రీకాంత్ కోసం గాలిస్తున్నారు. Also Read:
By February 09, 2020 at 07:13AM
No comments