స్నానం చేస్తుండగా వీడియో తీసి కోరిక తీర్చాలంటూ టార్చర్.. హైదరాబాద్‌లో వివాహిత ఆత్మహత్య
యువకుడి వేధింపులు, భర్త సూటిపోటి మాటలతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. బాత్రూమ్‌లో స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియోలు తీసిన యువకుడు తన కోరిక తీర్చకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించడాన్ని తట్టుకోలేకపోయిన వివాహిత భర్త కూడా వేధిస్తుండటంతో తట్టుకోలేక చావే శరణ్యమనుకుంది. Also Read: పాతబస్తీలోని ఉప్పగూడకు హనుమాన్‌నగర్‌కు చెందిన మహిళ గతేడాది మే నెలలో బాత్రూమ్‌లో స్నానం చేస్తుండగా అదే ప్రాంతానికి చెందిన యువకుడు రహస్యంగా సెల్‌ఫోన్లో రికార్డు చేశాడు. ఆ వీడియోను బాధితురాలికి పంపించి కోరిక తీర్చాలని, అడిగినంత డబ్బు ఇవ్వాలని, లేకపోతే వాటిని సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తాననని బెదిరించాడు. దీంతో భయపడిన బాధితురాలు భర్తకు తెలియకుండా నిందితుడికి రెండు దఫాలుగా రూ.1.92 లక్షలు ముట్టజెప్పింది. మూడు తులాల బంగారు ఆభరణాలను కూడా ఇచ్చింది. Also Read: బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బు తగ్గడం, బంగారు ఆభరణాలు కూడా కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన భర్త ఆమెను నిలదీయగా అసలు విషయం చెప్పింది. దీంతో అతడు డిసెంబర్ 19న భార్యతో ఛత్రినాక పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి భర్త, అత్తింటి వారు ఆమెను సూటిపోటి మాటలతో వేధించసాగారు. దాన్ని తట్టుకోలేకపోయిన బాధితురాలు డిసెంబర్ 31న ఆత్మహత్యకు యత్నించింది. ప్రాణాపాయం నుంచి బయటపడటంతో అప్పటి నుంచి ఎస్సార్‌నగర్ పరిధిలోని సుభాష్‌నగర్‌లో గల పుట్టింట్లోనే ఉంటోంది. Also Read: యువకుడి వల్ల ఎదురైన వేధింపులు, భర్త తనను పుట్టింట్లోనే వదిలేసి పట్టించుకోకపోవడంతో కొద్దిరోజులుగా తీవ్ర మనస్తాపానికి గురవుతోంది. దీంతో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో వారు ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడి వేధింపులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం, మరోవైపు భర్త సూటిపోటి మాటల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పుట్టింటివారు ఆరోపిస్తున్నారు. Also Read:
By February 09, 2020 at 07:42AM
No comments