హైదరాబాద్‌లో టిక్‌టాక్ ప్రేమ లొల్లి... పోలీసుల ఎదుటే గొంతు కోసుకున్న యువతి
ప్రేమించి లైంగికంగా దోచుకున్న యువకుడు పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో ఓ యువతి పోలీసులు ఎదుటే గొంతు కోసుకున్న ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చోటు చేసుకుంది. రాజమండ్రికి చెందిన వీరబాబు(20) అనే యువకుడు కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి డ్రైవర్‌గా పనిచేస్తూ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మగుడి సమీపంలో అద్దెకుంటున్నాడు. Also Read: ఐదు నెలల క్రితం అతడికి లింగంపల్లిలో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న స్వప్న(20)తో టిక్‌టాక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీయడంతో ఇద్దరూ హద్దులు దాటారు. పెళ్లి చేసుకుంటానని స్వప్నను నమ్మించిన వీరబాబు ఆమెను తరచూ తన రూమ్‌కి పిలిపించుకుని లైంగికంగా అనుభవించేవాడు. ఈ క్రమంలోనే వారం రోజుల క్రితం తనను పెళ్లి చేసుకోవాలని స్వప్న అతడిని కోరగా నిరాకరించాడు. దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చినా వీరబాబు పెళ్లిని నో చెప్పాడు. వీరబాబుతో రాజీ పడుతున్న పోలీసులకు లేఖ ఇచ్చి వెళ్లిపోయిన స్వప్న శనివారం మళ్లీ స్టేషన్‌కు వచ్చింది. Also Read: దీంతో పోలీసులు మళ్లీ వీరబాబును పిలపించి మాట్లాడినా పెళ్లికి ససేమిరా అన్నాడు. పోలీసులు ఎంత చెప్పినా ప్రియుడు తనను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోకపోవడంతో మనస్తాపం చెందిన స్వప్న స్టేషన్‌లో బ్లేడ్‌తో గొంతు కోసుకుంది. షాకైన పోలీసులు ఆమెను వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆమెకు స్వల్పగాయమైందని, ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాను వీరబాబుపై కేసు పెట్టనని, అతడిని ఎలాగైనా పెళ్లికి ఒప్పించాలని స్వప్న పోలీసులకు కోరింది. పీఎస్‌కు వచ్చే ముందుకు ఆమె సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన వీడియోను పోలీసులు గుర్తించారు. తనను ప్రియుడు ఎందుకు పెళ్లి చేసుకోను అంటున్నాడో ఈ వీడియోలో చెప్పుకొచ్చింది. ఈ ఘటనకు కారణమైన వీరబాబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. Also Read:
By February 09, 2020 at 06:46AM
No comments