Breaking News

ఇద్దరమ్మాయిల స్వలింగ సంపర్కం.. తండ్రి ఏం చేశాడంటే..?


పని నేర్చుకోవడానికి వచ్చిన ఓ బాలికను మరో మహిళ స్వలింగ సంపర్కానికి ప్రేరేపించింది. దీంతో స్నేహం పేరుతో తన కుమార్తెను స్వలింగ సంపర్కానికి ప్రేరేపిస్తున్న మహిళపై చర్యలు తీసుకోవాలంటూ రాజధాని చెన్నై తిరుమంగళం పోలీసుస్టేషన్‌లో ఓ యువతి తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు.. Also Read: జిల్లాకు చెందిన ఆనంద్‌ (44) తన కుమార్తె (17)కు సరిగా చదువు రాకపోవటట్లేదు. దీంతో చెన్నై సైదాపేటలోని బంధువుల ఇంట్లో ఉంచాడు. తర్వాత బాలికను నుంగంబాక్కంలోని ఓ ప్రైవేటు శిక్షణా కేంద్రంలో కొన్ని నెలలుగా బట్టలు కుట్టే పని నేర్చుకునేందుకు చేర్చించాడు. అయితే ఆ సమయంలో అక్కడున్న మరో యువతితో బాలికకు స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్తా స్వలింగ సంపర్కానికి దారిసినట్లు ఆనంద్ పోలీసులకు తెలిపారు. Also Read: ఈ నేపథ్యంలో తమ కుమార్తె గత కొన్ని రోజుల క్రితం సైదాపేట బంధువుల ఇంటి నుంచి అదృశ్యమైందన్నారు. బాలిక కోసం గాలిస్తుండగా అన్నానగర్‌ వెస్ట్‌ ప్రాంతంలోని ఓ సంస్థలో చేరినట్లు తెలిసిందన్నారు. దీంతో తన కుమార్తెను పంపాలని కోరినా ఆ సంస్థ నిర్వాహకులు నిరాకరిస్తున్నారని తెలిపారు. ఎలాగైనా తమ కుమార్తెను వారి నుంచి రక్షించాలని కోరారు. దీనిపై తగు చర్యలు తీసుకొని తన కుమార్తెను రక్షించాలని కోరారు. దీనిపై తిరుమంగళం పోలీసులు కేసు నమోదు చేసి బాలికతో సంబంధమున్న మరో యువతిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. Also Read:


By January 10, 2020 at 12:52PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tamilnadu-man-complain-against-woman-due-to-sexual-relationship-with-his-daughter/articleshow/73185091.cms

No comments