Breaking News

హద్దులు దాటిన ప్రేమికులు.. ప్రియురాలు గర్భం దాల్చిందని తెలిసి దారుణహత్య


తన కంటే వయస్సులో ఏడాది పెద్దదైన యువతితో ప్రేమాయణం నడిపి గర్భవతిని చేసిన టీనేజర్‌కు న్యాయస్థానం ఏకంగా 65 ఏళ్ల జైలుశిక్ష విధించింది. అమెరికాలోకి ఇండియానాకు చెందిన ఆరోన్ ట్రెజో(17) అనే టీనేజర్ బ్రెనా రౌసెలాంగ్(18) అనే యువతి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ శారీరకంగా దగ్గర కావడంతో బ్రెనా గర్భం దాల్చింది. కానీ ఈ విషయం ప్రియుడికి చెప్పకుండా అతడితో రాసలీలలు సాగిస్తూనే ఉంది. Also Read: ఆరు నెలల తర్వాత ప్రియురాలి శరీరంలో మార్పులు గమనించిన ఆరోన్ ఏం జరిగిందని ఆరా తీయగా.. తాను ఆరు నెలల గర్భవతిని అని చెప్పడంతో అతడు షాకయ్యాడు. ఇన్ని రోజులు తన దగ్గర ఈ విషయం ఎందుకు దాచావని ప్రియురాలి మందలించి అబార్షన్ చేయించుకోవాలని కోరాడు. ఇప్పుడు అబార్షన్ చేయించుకుంటే తన ప్రాణాలకే ముప్పు వస్తుందని బ్రెనా తిరస్కరించింది. ఈ విషయం బయటకు తెలిస్తే తన తల్లిదండ్రులు తనను నిలదీస్తారని ఆందోళన పడిన అరోన్ ప్రియురాలిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. Also Read: 2018, డిసెంబర్‌లో ఓ రోజు తన ఇంట్లో ఎవరూ లేరని, మాట్లాడుకుందామంటూ అరోన్ తన ప్రియురాలిని పిలిచాడు. ఆమెతో కాసేపు మాట్లాడిన తర్వాత కత్తితో అనేకసార్లు పొడిచి ఆమెను చంపేశాడు. మృతదేహాన్ని ఇంటి సమీపంలో ఉన్న డంప్ యార్డ్‌లో పూడ్చిపెట్టాడు. తమ కుమార్తె కనపించడం లేదని బ్రెనా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఫోన్‌కాల్స్ ఆధారంగా విచారణ చేపట్టి అరోన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రియురాలిని తానే చంపినట్లు అరోన్ అంగీకరించడంతో పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచారు. సుమారు ఏడాదిగా ఈ కేసుపై విచారణ జరుపుతున్న న్యాయస్థానం బుధవారం అరోన్‌ను దోషిగా నిర్ధారిస్తూ 65ఏళ్ల జైలుశిక్ష విధించింది. Also Read:


By January 10, 2020 at 01:02PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/us-indiana-teenager-gets-65yr-prison-over-killed-his-pregnant-girl-friend/articleshow/73185209.cms

No comments