Breaking News

iSmart Shankar: ‘ఇస్మార్ట్ శంకర్’ ట్విట్టర్ టాక్: మార్ ముంత చోడ్ చింత!


‘నాతో కిరికిరి అంటే పోచమ్మ గుడిముంగట పొట్టెల్ని కట్టేసినట్టే.. మార్ ముంత చోడ్ చింత!’ అంటూ థియేటర్స్‌లో ప్రేక్షకుల మధ్య కిరికిరి చేసేందుకు ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో నేడు (జూలై) థియేటర్స్‌కి వచ్చేశాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. వరుస పరాజయాలతో ఢీలా పడ్డ ఈ ఎనర్జిటిక్ స్టార్ రామ్.. ‘టెంపర్’ చిత్రం తరువాత హిట్ ముఖమే చూడని డేరిండ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌ పూరీని కాంబోలో వచ్చిన ‘ఇస్మార్ శంకర్’ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. పూరీ మార్క్ టేకింగ్‌కి హై ఓల్టేజ్ యాక్షన్‌తోడు కావడంతో ట్రైలర్, టీజర్‌లు ‘మార్ ముంతా ఛోడ్ చింతా’ లెక్కే ఉన్నాయి. Read Also: నిధి అగర్వాల్, నభా నటేష్ లాంటి యంగ్ హీరోయిన్లు రామ్‌తో జోడీ కట్టగా.. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌‌లో అందాల కనువిందు చేసి.. ఈ సినిమా ‘A’ సర్టిఫికేట్‌ను అందించారు. వీరి ఎక్స్‌పోజింగ్‌కి తోడు రామ్ డబుల్ మీనింగ్ డైలాగ్‌లు.. పూరీ మార్క్ డైరెక్షన్‌తో ఈ చిత్రం పెద్దలకు మాత్రమే అంటూ సెన్సార్ వాళ్లు ‘A’ సర్టిఫికేట్‌ ఇవ్వడంతో మాస్ ఆడియన్స్‌ను ‘ఇస్మార్ శంకర్’ థియేటర్స్ వైపు లాక్కుని రావడం ఖాయంగానే కనిపిస్తోంది. దీనికి తోడు పూరీ డైరెక్షన్‌లో వచ్చిన ‘పోకిరి’, ‘దేశముదురు’, ‘బిజినెస్ మేన్’ తదితర చిత్రాలకు గతంలో ‘A’ సర్టిఫికేట్ వచ్చి.. ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’కి ‘A’ సర్టిఫికేట్ రావడంతో ఖుషీలో ఉన్నారు పూరీ. ఇక ఈ చిత్రాన్ని టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి, ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మించడం విశేషం. ఇక ఈ చిత్రానికి సంబంధించి ట్విట్టర్‌లో స్పందనలు వినిపిస్తున్నారు. సినిమా విడుదలకు వారం ముందే ‘దీనమ్మా కిక్కూ’ అంటూ ఫస్ట్ రివ్యూ అందించిన రామ్.. నేడు నెటిజన్లతో ముచ్చటించారు. రామ్ అన్నా.. మా డాడీ ఫ్యామిలీతో కలిసి ‘ఇస్మార్ శంకర్’ సినిమాకి వెళ్తున్నా.. చూడొచ్చంటావా? అంటే.. నిర్మొహమాటంగా ఆన్సర్ ఇచ్చారు రామ్. మీడాడీ నీతో ఫ్రెండ్లీగా ఉంటే హాయిగా చూడొచ్చు. సిన్సియర్ అయితే విడి విడిగా సినిమా చూడటం బెటర్. ఇంతకంటే ఏం చెప్తాం.’ అనేశారు రామ్.. ఇంకా రామ్ ఏమన్నారో ఈ ట్వీట్ల ద్వారా చూద్దాం.


By July 18, 2019 at 06:56AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-pothineni-starrer-ismart-shankar-movie-audience-and-public-review/articleshow/70269520.cms

No comments