Breaking News

Balakrishna: రోజా గారు హీరో.. బాలయ్య ఆమెకు దిష్టిబొమ్మ: వర్మ


వర్మ గారు మళ్లీ పుల్ల పెట్టేశారుగా.. వైసీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణలు కలిసి ఇటీవల ఓ సందర్భంలో సెల్ఫీ దిగారు. ఆ సెల్ఫీని రోజా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోను వర్మ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ బాలయ్యపై దారుణమైన కామెంట్స్ చేశారు. ‘వావ్.. రోజా గారు అచ్చం హీరోలా ఉన్నారు. ఆమె పక్కన ఉన్న వ్యక్తి ఎవరో నాకు తెలీదు కానీ చూడటానికి చాలా అసహ్యంగా ఉన్నాడు. రోజా పక్కన కూర్చుని ఆమె అందానికి మచ్చ తెస్తున్నాడు. బహుశా అతను రోజాకి దిష్టిబొమ్మ అనుకుంటా’’ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. వర్మ ఇంతటితో ఆగలేదు. అదే ఫొటోను కాస్త జూమ్ చేసి మళ్లీ పోస్ట్ చేశారు. ‘అందమైన రోజా పక్కన కూర్చుని ఫొటోను నాశనం చేసిన ఆ వ్యక్తి ఎవరో నాకు ఎవరైనా చెప్తారా?’ అని ప్రశ్నించారు. వర్మ ఇలాంటి ఫొటోలు, కామెంట్స్ ఎప్పుడెప్పుడు పెడ్తారా అని ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్. అందులోనూ ప్రత్యర్ధి పార్టీలైన వైసీపీ, టీడీపీ పార్టీల ఎమ్మెల్యేలు సెల్ఫీ దిగడం, అందులోనూ వర్మ ఆ ఫొటోపై కామెంట్ చేస్తే ఇక ఫ్యాన్స్ ఆగుతారా. READ ALSO: అందుకే బాలయ్య ఫ్యాన్స్ ఒకవైపు నుంచి జగన్ ఫ్యాన్స్ మరో వైపు నుంచి తెగ కామెంట్స్ పెట్టారు. ఓ వ్యక్తి వర్మ పక్కన బాలకృష్ణ కూర్చున్న ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘లయన్ బాలయ్య పక్కన కూర్చుని ఫొటోను పాడుచేసిన ఆ వ్యక్తి ఎవరో చెప్తారా’ అంటూ వర్మకు కౌంటర్ వేశారు. అంతేకాదు చాలా మంది బాలయ్య అభిమానులే ఈ ట్వీట్స్‌కి స్పందించారు. ఇంకోసారి బాలయ్య జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ అసభ్యకరమైన పదజాలం వాడుతూ కామెంట్స్ చేశారు. READ ALSO:


By January 23, 2020 at 10:33AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/controversial-director-ram-gopal-varma-shares-a-picture-of-roja-and-balakrishna-says-former-is-a-hero/articleshow/73540859.cms

No comments