Breaking News

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. భయాందోళనలో ప్రజలు


నగర శివారులోని రాజేంద్ర నగర్‌లో గురువారం తెల్లవారుజామున భారీ సంభవించింది. ప్లాస్టిక్ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజేంద్రనగర్ పరిధిలోని దానిమ్మ ప్రాంతంలో ఈ ప్లాస్టిక్ గోదాం ఉంది. నివాస ప్రాంతంలో ఏర్పాటుచేసిన ఈ గోదాములో అగ్నిప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. Also Read: ప్లాస్టిక్ గోడౌన్ నుంచి దట్టమైన పొగలు దాదాపు కిలోమీటరు వరకు వ్యాపించాయి. నివాస ప్రాంతాలకు మంటలు వ్యాపించే ప్రమాదం ఉందన్న అంచనాతో పోలీసులు కొందరి ఇళ్లను ఖాళీ చేయించారు. రాజేంద్రనగర్ అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల సాయంతో గంటసేపు శ్రమించి మంటలను అదుపు చేశారు. దట్టమైన పొగతో స్థానికులు చాలాసేపు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. Also Read: ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. నివాస ప్రాంతాల్లో కొనసాగుతున్న ఈ గోదాముకు ఎలాంటి అనుమతులు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొందరు పెద్దల అండదండలతో దీన్ని అక్రమంగా నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది. Also Read:


By January 23, 2020 at 10:15AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/massive-fire-broke-out-at-plastic-godown-in-hyderabad/articleshow/73540367.cms

No comments