బలవంతపు పెళ్లి కోసం.. పోలీస్ అధికారి కూతురినే కిడ్నాప్ చేసిన యువకులు

తన ప్రేమను నిరాకరించిందన్న కారణంతో ముగ్గురు యువకులు ఏకంగా పోలీస్ అధికారి కూతురినే కిడ్నాప్ చేసిన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. అయితే ప్రమాదవశాత్తూ కారు బోల్తా పడటంతో వారి పన్నాగం బయటపడింది. అసలు విషయం తెలుసుకున్న స్థానికులు ఆ ముగ్గురిని చితకబాది పోలీసులకు అప్పగించారు. Also Read: నగర శివారు మంగాడు సమీపం కెరుగంబాక్కంలో మంగళవారం ఉదయం ఓ కారు బోల్తాపడింది. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని ఓ యువతి సహా ముగ్గురు యువకులను రక్షించారు. ఆ ముగ్గురు తనను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారని యువతి స్థానికులు చెప్పింది. దీంతో ఆగ్రహించిన వారు ముగ్గురు యువకులకు దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు యువకులను అరెస్టు చేశారు. విచారణలో ఆ యువతి పోలీసు అధికారిక కూతురని, మౌలివాక్కానికి చెందిన ఓ కాలేజీలో ప్లస్ వన్ చదువుతున్నట్లు తెలిసింది. Also Read: అదే కాలేజీకి చెందిన అరవింద్‌కుమార్ ప్రేమించాలంటూ ఆమెను కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఆమెను నిరాకరించడంతో బలవంతంగా పెళ్లి చేసుకోవాలన్న దురాశతో బుధవారం ఇద్దరు స్నేహితుల సాయంతో యువతిని కిడ్నాప్ చేశాడు. వీరు కారు మంగాడు సమీపం కెరుగంబాక్కంలో వేగంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనపై బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు అరవింద్‌కుమార్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అతడి ఇద్దరు స్నేహితులను కెల్లీస్‌లో ఉన్న హోమ్‌లో చేర్చారు. Also Read:
By January 23, 2020 at 10:31AM
No comments