బీఎస్ఎఫ్ జవాన్ ఇంట్లో వ్యభిచారం.. గంటకు రూ.3వేలు తీసుకుని అమ్మాయిల సరఫరా
ఉత్తరప్రదేశ్‌లోని నగరంలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్‌ను యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఛేదించింది. మీరట్‌లోని రోహతా రోడ్‌లోని ఓ ఇంటిపై దాడి చేసి పోలీసులు అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించి ఇద్దరు బాలికలతో పాటు పలువురు విటులను అరెస్ట్ చేశారు. Also Read: బీఎస్ఎఫ్ జవాన్‌గా పనిచేసే ఓ వ్యక్తికి చెందిన ఇంటిని మూడు నెలల క్రితం హర్యానాకు చెందిన ఓ డ్యాన్సర్ అద్దెకు తీసుకుంది. హర్యానా, ఢిల్లీ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి అక్కడ గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తోంది. సోషల్‌మీడియా ద్వారా అమ్మాయిల ఫోటోలను పంపిస్తూ విటులను ఆకర్షించేవారు. ఒక్కో కస్టమర్ నుంచి గంటకు రూ.3వేల వసూలు చేసి అమ్మాయిలను సరఫరా చేసేవారు. వీరి కార్యకలాపాలపై కొద్దిరోజులుగా నిఘా పెట్టిన పోలీసులు శుక్రవారం రాత్రి రైడ్ చేసి నిర్వాహకురాలితో పాటు సెక్స్ వర్కర్లు, విటులను అదుపులోకి తీసుకున్నారు. సెక్స్‌వర్కర్లలో 17ఏళ్ల బాలిక కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. Also Read: సెక్స్‌వర్కర్లను పునరావాస కేంద్రానికి తరలించిన పోలీసులు విటులను, నిర్వాహకులను రిమాండ్‌కు తరలించారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో ఇంటి యజమాని అయిన బీఎస్ఎఫ్ జవాన్ పాత్ర ఉందా? లేదా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ నివాసాల మధ్య వ్యభిచారం జరుగుతున్నట్లు తెలియడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. Also Read:
By January 12, 2020 at 09:57AM
No comments