సరిలేరు నీకెవ్వరు తొలిరోజు కలెక్షన్స్: నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్
సూపర్‌స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య శనివారం విడుదలైంది. ముందుగా ఊహించినట్లుగానే బొమ్మ దద్దరిల్లిపోయింది. సినిమా విడుదలైన తొలిరోజే బ్లాక్ బస్టర్ కా బాప్‌ని తేల్చేశారు. ఇక తొలి రోజు వసూళ్ల విషయానికొస్తే తెలుగు రాష్ట్రాల్లో ‘సరిలేరు నీకెవ్వరు’ దుమ్ముదులిపేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టా్ల్లో తొలిరోజు సినిమా 35 కోట్ల రూపాయలు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. నిజామాబాద్‌లో పది కోట్లు రాబట్టిందట. గుంటూరు, కృష్ణ, నెల్లూరు జిల్లాల్లో సాలిడ్ కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ ఓపెనింగ్ అదిరిపోయింది. ప్రపంచవ్యాప్తంగా సినిమా 47 కోట్లు రాబట్టింది. అమెరికాలో తొలిరోజు ఆరు కోట్లు రాబట్టిందట. సినిమాకు వస్తున్న హైప్‌తో మరికొన్ని రోజుల పాటు ఇంతే రేంజ్‌లో కలెక్షన్లు రాబడుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అమెరికాలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం దాదాపు 252 ప్రదేశాల్లో విడుదలైంది. ‘నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్’ అన్నట్లు.. అమెరికాలో తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 15 సినిమాల్లో ‘సరిలేరు..’ చోటు దక్కించుకుందట. మొత్తానికి మహేష్.... ‘బొమ్మ దద్దరిల్లిపోద్ది.. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా.. సినిమా మొదలైన రోజునుండి ఇప్పటిదాకా ఇదే వైబ్‌ని ఫీల్ అవుతున్నా. READ ALSO: బ్లాక్ బస్టర్ రాబోతుందని ముందుగా తెలిసినప్పుడే ఇలా జరుగుతుంది’ అన్న మాటలు నిజం అయ్యాయి. అన్నట్లుగానే సంక్రాంతి పూట ప్రేక్షకులకు బ్లాక్ బస్టర్ బొమ్మను చూపించారు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం దర్శకుడు అనిల్ రావిపూడికి వరుసగా ఐదో హిట్, మహేష్‌కి వరుసగా మూడో హిట్ ఇచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మిక మందనకు తొలి భారీ హిట్ దక్కింది. ఇక పదమూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన లేడీ అమితాబ్ విజయ శాంతికి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టడానికి సరైన సినిమానే పడింది. సంగీత, హరితేజ, రాజేంద్ర ప్రసాద్ తదితరులకు కూడా మంచి మార్కులు పడ్డాయి. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా సినిమాను నిర్మించారు. READ ALSO: సెలబ్రేషన్స్ షురూ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించిన నేపథ్యంలో టీం అంతా కలిసి మహేష్ బాబు ఇంట్లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోను అనిల్ రావిపూడి ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ‘మీ విజిల్స్‌కి, మీ స్పందనకు, మీ అభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. సెలబ్రేషన్స్ షురూ’ అని పేర్కొన్నారు.
By January 12, 2020 at 09:46AM
No comments