Breaking News

ఏలూరులో వివాహితపై గ్యాంగ్ రేప్.. ఏ1 సహా ఇద్దరి అరెస్ట్


జిల్లా కేంద్రం ఏలూరులో వివాహితపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధితురాలు ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్‌ కిరణ్‌ తెలిపారు. గురువారం వారిద్దరిని మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. ఏలూరు లక్ష్మీవారపుపేటకు చెందిన వివాహిత డిసెంబర్ 12వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళను రౌడీషీటర్‌ షేక్‌ యాకోబు అడ్డగించాడు. అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడికి మందులు కొనుగోలు చేసి తిరిగి వెళ్తున్న ఆమెను ఇంటి వద్ద దించుతానని నమ్మించి బైక్ ఎక్కించుకున్నాడు. Also Read: ఆమెను మాటల్లో పెట్టి ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ యాకోబుతో పాటు అతని స్నేహితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు ఇంటికి వెళ్లింది. దుండగులకు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అలాగే ఉండిపోయింది. నిందితులు ఆమెను విడిచిపెట్టకుండా తమ కోరిక తీర్చాలంటూ బెదిరించడంతో బాధితురాలు ఈనెల 7న రాత్రి గ్రామీణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఏడుగురు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో కేసును నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. Also Read: ప్రధాన నిందితుడైన రౌడీషీటర్‌ యాకోబుతో పాటు మరో నిందితుడైప బావిశెట్టివారిపేటకు చెందిన కాశింశెట్టి సాయి అలియాస్‌ నల్లదిబ్బ సాయిలను అరెస్టు చేశామని ఏలూరు డీఎస్పీ దిలీప్‌ కిరణ్‌ తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని.. ఈ కేసు దర్యాప్తులో టెక్నాలజీ సాయం తీసుకుంటున్నామని, నిందితులకు కఠినశిక్ష పడేలా అన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన హెడ్‌ కానిస్టేబుళ్లు కె నాగరాజు, ఎన్‌వీ సత్యనారాయణ, డీవీ రమణ, కానిస్టేబుళ్లు సీతాదేవయ్య, నాగేశ్వరరావు, అజయ్‌ తదితరులను డీఎస్పీ అభినందించారు. ఏలూరు పరిసర ప్రాంతాల్లోని రౌడీషీటర్ల కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టామని డీఎస్పీ తెలిపారు. ఎక్కడైనా అల్లర్లకు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. Also Read:


By January 10, 2020 at 11:42AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/eluru-police-arrested-two-accused-of-women-gang-rape-case/articleshow/73183938.cms

No comments