Breaking News

కశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంపై సుప్రీం సంచలన తీర్పు


గతేడాది ఆగస్టు 5న జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, 35ఏలను కేంద్ర రద్దుచేసి, ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వదంతులు వ్యాపించకుండా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఆరు నెలలు గడిచిపోయినా వాటిని పునరుద్దరించలేదు. ఈ అంశంపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ పూర్తిచేసిన సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది. జమ్మూ నిలపివేయడంపై ఉత్తర్వులను వారం రోజుల్లోగా సమీక్షించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అన్ని ప్రభుత్వం వెబ్‌సైట్‌లను పునరుద్దరించాలని ఆదేశాలు జారీచేసింది. ఇంటర్నెట్ సేవలు అంతర్గత భావాలను స్వేచ్ఛగా వెళ్లడించే హక్కుకు కిందకు వస్తాయని, ఎలాంటి కారణం, కాలపరిమితి లేకుండా వీటిని నిలిపివేయలేమని వ్యాఖ్యానించింది. ఇంటర్నెట్ సేవలను కొనసాగించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) భావ ప్రకటనా స్వేచ్ఛ కింద పరిరక్షింపబడతాయని, ఆర్టికల్ 19 (2)లో పేర్కొన్న కారణాల వల్ల మాత్రమే దానిని పరిమితం చేయవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అసమ్మతి తెలియజేస్తే ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం కుదరదని పేర్కొంది. ఈ ఆంక్షలు రాజ్యాంగ విరుద్ధమని, ప్రజల స్వేచ్ఛను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించింది. పూర్తిగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం తీవ్రమైన చర్య అని, ప్రత్యామ్నాయ మార్గాలు లేని పరిస్థితుల్లో మాత్రమే ఇలా వ్యవహరించాలని జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నప్పుడు, బాధితులు కోర్టును ఆశ్రయిస్తే దానికి చెప్పే కారణం సవివరంగా ఉండాలని పేర్కొంది. నిషేధిత ఉత్తర్వులను జారీ చేసినప్పుడు ఉన్నతాధికారులు అవి సరైవనే అనే ఆలోచించి, దామాషా సిద్ధాంతాన్ని పాటించాలని సుప్రీంకోర్టు తెలిపింది.


By January 10, 2020 at 11:32AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-verdict-on-internet-services-suspended-in-jammu-and-kashmir/articleshow/73183845.cms

No comments