Breaking News

నా భార్య నీకు.. నీ భార్య నాకు..! ఓ నీచుడి దుశ్చర్య


ఓ దుర్మార్గుడికి నీచమైన ఆలోచన వచ్చింది. తన భార్యను వేరొకరి వద్దకు పంపించి.. వారి భార్యలను తాను అనుభవించాలనే పరమ నీచమైన తలంపు చేశాడు. మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముంబైలో వ్యాపారం చేసే ఓ వ్యక్తికి (46) 2003లో పెళ్లి కాగా, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భార్య(39)తో కొన్నేళ్లు అన్యోన్యంగా గడిపిన అతడు.. వేరొకరి భార్యలతో పక్క పంచుకోవాలనే నీచమైన తలంపు చేశాడు. ఇదే విషయాన్ని తన స్నేహితులకు చెప్పి భార్యల్ని మార్చుకుందామని ఒప్పందం కుదుర్చుకున్నాడు. Also Read: అలా ఓ రోజు తన భార్యను వేరొకరి దగ్గరకు పంపి, అతడి భార్యను తాను అనుభవించాడు. ఇలా రెండేళ్లుగా తన భార్యను వేరొకరి వద్దకు పంపి, వారి భార్యలను తన వద్దకు తెచ్చుకొని వారితో సరససల్లాపాలు చేసేవాడు. ఇష్టం లేకపోయినా కాపురం, పిల్లల భవిష్యత్తు కోసం ఈ నరకాన్ని అనుభవిస్తూ వచ్చిన బాధిత భార్య చివరకు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. తొలుత 2017 జూన్ 15న నిందితుడు తన స్నేహితుడు, అతడి భార్యను కార్లో ఎక్కించుకొని తన భార్యతో కలిసి ఓ ఫ్లాట్‌కు వెళ్లాడు. అక్కడ స్నేహితుడి భార్యను తనతో ఉంచుకొని, తన భార్యను స్నేహితుడి బెడ్‌రూంకు పంపాడు. దీంతో నిందితుడి స్నేహితుడు ఆమెపై బలవంతంగా అత్యాచారయత్నం చేయబోయాడు. వద్దంటూ ప్రాధేయపడటంతో చివరకు వదిలిపెట్టాడు. ఆ తర్వాత 2017 అక్టోబర్‌లో కూడా మరోసారి ఇలాంటి పనే చేశాడు ఆ నీచుడు. Also Read: ఈ సారి మరో కొత్త జంటతో నీచపు పనికి ఒడిగట్టాడు. ఆ తర్వాత ఓ రోజు రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన స్నేహితుడిని ఇంటికి పిలిపించి.. భార్యపై అత్యాచారం చేయించాడు. దీన్ని వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. తన స్నేహితులతో పడుకోవాలని, లేకపోతే ఈ వీడియోలు ఇంటర్నెట్‌లో పెడతానంటూ బ్లాక్‌మెయిల్ చేశాడు. అలా పలు సందర్భాల్లో తన స్నేహితులకు ఆమెను ఎరగా వేశాడు. వాళ్ల భార్యలను తాను అనుభవించాడు. చివరకు వేధింపులు ఎక్కువవడంతో తట్టుకోలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచగా, డిసెంబర్ 23 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. Also Read:


By December 21, 2019 at 11:05AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/mumbai-businessman-exchange-his-wife-to-friends-finally-he-arrested/articleshow/72912080.cms

No comments