దర్శకుడితో సినీనటి లవ్ మ్యారేజ్.. పెంపుడు తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు
కన్నక సినీనటి విజయలక్ష్మి అదృశ్య ఘటన అనేక మలుపులు తిరుగుతోంది. మండ్యలో అదృశ్యమైన గురువారం మాన్వి తాలూకా హళ్లిహొసూరులో ప్రత్యక్షమయ్యారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, దర్శకుడు ఆంజనేయను పెళ్లి చేసుకున్న తర్వాత బెదిరింపులు వస్తుండటంతోనే హళ్లిహోసూరు వచ్చేసినట్లు తెలిపారు. Also Read: తుంగభద్ర సినిమాలో నాయకిగా నటిస్తున్నప్పుడు దర్శకుడు ఆంజనేయతో తనకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారిందని విజయలక్ష్మి తెలిపారు. అనంతరం తామిద్దరం వివాహం చేసుకున్నట్లు చెప్పారు. ఈ వివాహం తమ కుటుంబసభ్యులకు ఇష్టం లేదని, తనకు పెంపుడు తండ్రితో ప్రాణహాని ఉందని తెలిపారు. ఆంజనేయది హళ్లిహొసూరు గ్రామం కావటంతో ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. తమకు రక్షణ కల్పించాల్సిందిగా సిరివార పోలీసులను ఆశ్రయించి రక్షణ కోరినట్లు తెలిపారు. Also Read: తాము డిసెంబర్ 17వ తేదీన బెంగళూరులో వివాహం చేసుకున్నామని, అక్కడ కొందరి నుంచి బెదిరింపులు వస్తుండటంతో తన స్వగ్రామం హళ్లిహొసూరు వచ్చేసినట్లు దర్శకుడు ఆంజనేయ తెలిపారు. తాము ఎవరి దగ్గర నుంచి డబ్బు, నగలు, ఆభరణాలు తీసుకు రాలేదని చెప్పారు. ఒప్పందం చేసుకున్న సినిమాలను త్వరగా పూర్తి చేయాలన్నదే తామిద్దర లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకే పోలీసులను రక్షణ కోరామని పేర్కొన్నారు. Also Read:
By January 10, 2020 at 12:08PM
No comments