ఇంటర్యూ పేరుతో హోటల్‌కు రప్పించి రేప్.. వీడియో తీసి బెదిరింపులు
ఇంటర్వ్యూ పేరుతో ఓ మహిళను ట్రాప్ చేసిన కామాంధుడు ఆమెను హోటల్ రూమ్‌కి తీసుకెళ్లి చేసిన ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయిలో జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ ఎంబీఏ చదివి ఉద్యోగ ప్రయత్నాల కోసం ముంబయికి వచ్చి ఓ హాస్టల్‌లో ఉంటోంది. ఇటీవల తన రెజ్యూమ్‌ను ఆన్‌లైన్ జాబ్ పోర్టల్స్‌లో అప్‌లోడ్ చేసింది. కొద్దిరోజుల క్రితం ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి.. మీ రెజ్యూమ్‌కు చూశాను. మంచి ప్యాకేజీతో ఓ ప్రైవేటు బ్యాంకులోని హెచ్ఆర్ విభాగంలో జాబ్ ఇప్పిస్తానని నమ్మించాడు. Also Read: ఈ నెల 19వ తేదీని నవీ ముంబయిలోని జుహు ప్రాంతంలో గల ఓ హోటల్‌లో ఇంటర్వ్యూకి రావాలని చెప్పాడు. అతడి మాటలు పూర్తిగా నమ్మిన బాధితురాలు అతడు చెప్పిన హోటల్ రూమ్‌కి వెళ్లింది. కాసేపు నమ్మకంగా మాట్లాడిన అతడు హఠాత్తుగా తలుపు గడియ పెట్టేశాడు. ఊహించని ఘటనతో షాక్ గురైన బాధితురాలు అతడిని నిలదీయగా.. తన కోరిక తీర్చాలని వేధించాడు. ఆమె నిరాకరించడంతో తీవ్రంగా కొట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. Also Read: రెండ్రోజుల పాటు ఆమెను గదిలోనే నిర్బంధించి అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడి వీడియో తీశాడు. 22వ తేదీన ఆమెను విడుదల చేసి ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియో సోషల్‌మీడియాలో పెడతానని బెదిరించాడు. అయితే ధైర్యం చేసిన బాధితురాలు హోటల్ రూమ్ నుంచి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిపై ఐపీసీ 376(అత్యాచారం), 506(బెదిరింపులు) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఆదివారం అరెస్ట్ చేశారు. అతడిని ఏడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకుని విచారిస్తున్నట్లు ముంబయికి చెందిన ఓ పోలీసు అధికారి తెలిపారు. Also Read: గమనిక: అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు సంబంధించి గోప్యత పాటించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారి పేర్లు, వివరాలు వెల్లడించడంలేదు.
By September 24, 2019 at 09:02AM
No comments