ఫేస్‌బుక్ ప్రేమ.. రెండేళ్లు సహజీవనం.. ఆత్మహత్య
వాళ్లిద్దరు ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యారు. తరుచూ చాట్ చేసుకునే క్రమంలో ఆ పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. తీరా మోజు తీరాక ప్రియుడు పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పేశాడు. దీంతో మనస్తాపం చెందిన ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. దీంతో విషాదంగా ముగిసింది. Also Read: తెలంగాణలోని భద్రాచలంకు చెందిన చేబ్రోలు విమల(24) అనే యువతికి 2017లో ఓ వ్యక్తితో వివామమైంది. అయితే భర్తతో కలిసి ఉండలేక మూడు నెలలకే పుట్టింటికి వచ్చేసి విడాకులు తీసుకుంది. ఈ క్రమంలోనే ఆమెకు జిల్లా పోరండ్లకు చెందిన పవన్‌కుమార్‌తో ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. రోజూ చాట్ చేసుకోవడంతో ఇద్దరి మధ్య చనువు పెరిగి ప్రేమకు దారితీసింది. దీంతో వారిద్దరు కలిసి బతకాలనుకున్నారు. రెండేళ్ల నుంచి కరీంనగర్‌లో ఓ ఇళ్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. Also Read: తనను పెళ్లి చేసుకోవాలని విమల తరుచూ పవన్‌కుమార్‌పై ఒత్తిడి తెస్తుండగా అతడు ఎప్పటికప్పుడు దాటవేస్తూ వస్తున్నాడు. ఇటీవల ఈ విషయంపై ప్రియుడిని గట్టిగా నిలదీయగా.. ఇంతకుముందే పెళ్లయిన నిన్ను నేను పెళ్లిచేసుకోను. ఇద్దరికి ఇష్టం ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేద్దాం.. అంటూ పవన్ పెళ్లి ప్రతిపాదన తిరస్కరించాడు. దీంతో మనస్తాపం చెందిన విమల ఆదివారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు ఆత్మహత్యకు పవన్‌కుమారే కారణమని విమల తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:
By September 24, 2019 at 08:38AM
No comments