భార్య ఇంట్లో లేని సమయం చూసి మరదలిపై అఘాయిత్యం
అనారోగ్యంతో ఉన్న తన భార్యకు సపర్యలు చేసేందుకు వచ్చిన మరదలిపై అఘాయిత్యానికి పాల్పడబోయాడు ఓ కామాంధుడు. అయితే తన చెల్లెలి జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించిన భర్తను ఆ ఇల్లాలే పోలీసులకు పట్టించి శభాష్ అనిపించుకుంది. దీంతో ఆ మానవ మృగం కటకటాలు లెక్కపెడుతోంది. Also Read: బిహార్‌లోని భగల్‌పూర్ పట్టణంలో ఓ వ్యక్తి కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అయితే కొద్దిరోజులు అతడి భార్యకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమె చెల్లి వచ్చి సపర్యలు చేస్తోంది. మరదలిపై కన్నేసిన ఆ కామాంధుడు ఆమెను తనకిచ్చి పెళ్లి చేయాలని భార్య వద్ద ప్రతిపాదించాడు. ‘నీకు ఆరోగ్యం బాగోవడం లేదు కదా. నీ చెల్లెలిని నాకిచ్చి పెళ్లి చేస్తే మీరిద్దరు ఒకే ఇంట్లో కలిసి ఉండొచ్చు’ అని చెప్పడంతో ఆమె షాకైంది. తన చెల్లెలు అమాయకురాలని, దాని జీవితం నాశనం చేయొద్దని భార్య ప్రాధేయపడింది. Also Read: అయితే ఆమె మాట వినని ఆ కామాంధుడు మరదలిని కోరిక తీర్చాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. ఎన్నోసార్లు ఇంట్లోనే అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించగా భార్య అడ్డుకుంది. శనివారం అతడి భార్య ఏదో పని నిమిత్తం బయటకు వెళ్లడంతో ఇంట్లో ఆమె చెల్లి ఒంటరిగా ఉంది. దీంతో ఆ వ్యక్తి తలుపులు గడియపెట్టి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. వదిలేయాలని బాధితురాలు ప్రాథేయపడినా వినలేదు. అదే సమయంలో తిరిగొచ్చిన ఆమె అక్క ఇంట్లో నుంచి వస్తున్న కేకలు విని స్థానికులను అప్రమత్తం చేసింది. తలుపులు పగులగొట్టి భర్తను చితకబాదింది. పోలీసులకు ఫిర్యాదు చేసి భర్తను కటకటాల్లోకి నెట్టింది. Also Read:
By September 23, 2019 at 08:57AM
No comments