భార్యతో అఫైర్ పెట్టుకున్నాడని కత్తితో పొడిచి చంపేశాడు
తన భార్యతో పెట్టకుని తన సంసారాన్ని నాశనం చేశాడన్న కక్షతో పక్కింటి వ్యక్తిని దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడో వ్యక్తి. పాకిస్థాన్‌లోని సూర్జని నగరంలో చెందిన ఫైజల్ అనే వ్యక్తి భార్యతో కలిసి నివసిస్తున్నాడు. ఇటీవల దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. నెలరోజుల క్రితం ఇంట్లో పెద్ద గొడవ కావడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. వారి ఇంటి పక్కనే ఉండే షాహీన్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. Also Read: భర్త అడ్డు లేకపోవడంతో ఆమె షాహీన్‌తో షికార్లు కొట్టేది. ఈ విషయం ఫైజల్‌కు తెలియడంతో తన దగ్గరకు వచ్చేయాలని కోరగా ఆమె పట్టించుకోలేదు. దీంతో షాహీన్ తండ్రిని కలిసి కొడుకును అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించాడు. అయినప్పటికీ షాహీన ఆమెతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. దీంతో కోప్రోదిక్తుడైన ఫైజల్ ఈ నెల 14వ తేదీన షాఫీన్ ఇంటికెళ్లి కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపేశాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న ఫైజల్‌ను ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read: Also Read:
By September 23, 2019 at 09:36AM
No comments