వెరైటీ డ్రెస్‌లో నిహారిక.. దీన్ని హాట్, ఎక్స్‌పోజింగ్ అంటారా?
హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు.. ఇలా సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది కుమార్తెలు హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ అంటే కాస్త ఇబ్బందే. అయినప్పటికీ, నాగబాబు గారాలపట్టి నిహారిక ఆ ధైర్యం చేశారు. హీరోయిన్‌గా పరిచయమయ్యారు. మొదట్లో మెగా అభిమానులు కాస్త కస్సుబుస్సులాడినా నాగబాబు వాళ్లను బుజ్జగించారు. తన కూతురు హాట్ రోల్స్ చేయదని, నటనపై ఇష్టంతో సినిమాలు చేస్తానంటోందని క్లారిటీ ఇచ్చారు. నిహారిక కూడా వెండితెరపై అందాల ఆరబోత లాంటి పాత్రలు చేయలేదు. తనలోని నటనను నిరూపించుకునే ప్రయత్నమే చేశారు. కానీ, ఫలితం లేదు. వరసపెట్టి సినిమాలు చేస్తోన్నా ప్రేక్షకులు ఆదరిచండంలేదు. అందుకే, ఆమె వెబ్‌సిరీస్‌ల వైపు మళ్లారు. ‘మ్యాడ్ హౌస్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. మరోవైపు, ‘సైరా’ సినిమాలో బోయపిల్ల పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్లో నిహారిక పాత్రను పరిచయం చేశారు. Also Read: ఇదిలా ఉంటే, నిహారిక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో లేటెస్ట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. వీళ్లందరితో నిహారిక తన పోస్టుల ద్వారా టచ్‌లో ఉంటారు. అయితే, తాజాగా ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు చర్చకు దారితీశాయి. ఒక వెరైటీ మోడరన్ డ్రెస్‌లో నిహారిక ఫొటోషూట్ చేశారు. ఈ ఫొటోల్లో నిహారిక గుర్తుపట్టలేని విధంగా ఉందంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. నిజానికి, కొన్ని వెబ్‌సైట్‌లలో నిహారిక ‘‘హాట్, ఆరబోసింది’’ అని ఇష్టమొచ్చినట్టు రాశారు. కానీ, ఆమె అభిమానుల అభిప్రాయం మాత్రం విరుద్ధంగా ఉంది. అసలు ఎక్స్‌పోజింగ్ ఏమీ లేదని, డ్రెస్ డిఫరెంట్‌గా ఉండటం వల్ల గుర్తుపట్టడం కాస్త కష్టమైందని కామెంట్లు పెడుతున్నారు. నిజంగా నిహారిక డ్రెస్‌లో వల్గారిటీ ఏమీ లేదు. బయట చాలా మంది అమ్మాయిలు వేసుకున్నట్టు ఆమె కూడా కొత్త డ్రెస్ ట్రై చేశారు అంతే. నిజమేగా.. మీరే చూడండి..!
By September 19, 2019 at 11:00AM
No comments