Breaking News

సంపత్ నంది.. మళ్లీ ఆ హీరోతోనే..!


మ్యాచో హీరో గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో శ్రీనివాసా చిట్టూరి భారీ చిత్రం

యూ టర్న్ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ ‘ప్రొడక్షన్ నెం.3’ని త్వరలో ప్రారంభిస్తున్నట్లు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి చెప్పారు. మ్యాచో హీరో గోపీచంద్ హీరోగా నటించే ఈ భారీ చిత్రానికి మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తారు. ఇప్పటికే గోపీచంద్‌ని ‘గౌతమ్ నందా’గా సంపత్ నంది డైరెక్ట్ చేసి ఉన్నారు. హై బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందే ఈ ప్రెస్టీజియస్ మూవీకి సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత శ్రీనివాసా చిట్టూరి తెలిపారు.

ఈ చిత్రానికి...

సమర్పణ: పవన్ కుమార్

నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి

కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంపత్ నంది



By September 20, 2019 at 03:19AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/47523/sampath-nandi.html

No comments