Breaking News

ప్రేమపెళ్లి చేసుకుని.. నాలుగు రోజులకే నవ వధువు ఆత్మహత్య


ఓ యువకుడిని ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న యువతి నాలుగు రోజులకే ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కమలాపురంలో చోటుచేసుకుంది. మండలం బాలిరెడ్డిపల్లి దళితవాడకు చెందిన ఈశ్వరమ్మ(18) బంధువైన కానూరు శ్రీనును ప్రేమించింది. ఆమె తల్లిదండ్రులు మైదుకూరు మండలం జాండ్లవరం నుంచి వలస వచ్చి మామిడి, జామ తోటలకు కాపలాదారుగా పనిచేస్తున్నారు. వీరి ప్రేమకు కుటుంబసభ్యులు తొలుత అంగీకరించనప్పటికీ ప్రేమికుల ఒత్తిడి మేరకు చివరకు ఓకే చెప్పారు. దీంతో గత వారం ఇద్దరికీ పెళ్లి చేశారు. ప్రేమించుకుని వివాహ బంధంతో ఒక్కటైన ఈశ్వరమ్మ, శ్రీను నాలుగు రోజులు సంతోషంగా గడిపారు. కుటుంబసభ్యులు కూడా వారి అనురాగాన్ని చూసి సంతోషించారు. అయిగు ఈశ్వరమ్మ గురువారం ఇంట్లోనే పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించగా శుక్రవారం రాత్రి ప్రాణాలు కోల్పోయింది. పెళ్లి కోసం వేసిన పందిరులు తీయకుండానే ఆ ఇంట్లో విషాదం నెలకొనడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్న ఈశ్వరమ్మ ఎందుకు ఆత్మహత్య చేసుకుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


By July 13, 2019 at 08:03AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/newly-married-bride-cimmits-suicide-in-kadapa-district/articleshow/70200750.cms

No comments