Breaking News

Wedding: పళలట పన వషద.. ఊరగపప దసకళలన టరకక.. ఐదగర మత


మరి కాసేపట్లో వధువు ఇంటికి పెళ్లివారు చేరుకుంటారనగా ట్రక్కు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఊరేగింపుగా వస్తున్న పెళ్లి బృందంపై వాహనం దూసుకెళ్లిన ఘటన ఒడిశాలోని కెంఝోర్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఊరేగింపుగా వస్తున్న సమయంలో అటుగా వచ్చిన లారీ.. అదుపుతప్పింది. దీంతో పెళ్లి బృందంలోని డజను మందికిపైగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురు చనిపోగా.. మిగతా వారిని చికిత్స కోసం తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉంది. By June 28, 2023 at 10:33AM Read More https://telugu.samayam.com/latest-news/crime/five-killed-and-nine-critical-injured-as-truck-rams-into-wedding-procession-in-keonjhar-of-odisha/articleshow/101327469.cms

No comments