Breaking News

సునామీలా కోవిడ్.. ఆరోగ్య వ్యవస్థలు పతనం తప్పదు: WHO తీవ్ర ఆందోళన


కరోనా కొత్త వేరియంట్‌ ప్రపంచ దేశాల్లో వేగంగా విస్తరించడంతో మహమ్మారి ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. డిసెంబర్‌ 20-26 మధ్య ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది కొత్తగా కోవిడ్ బారినపడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ()వెల్లడించింది. అంతకుముందు వారంతో పోలిస్తే పాజిటివ్ కేసుల్లో 11శాతం పెరుగుదల నమోదయ్యిందని పేర్కొంది. ఓమిక్రాన్, డెల్టా వేరియంట్ కోవిడ్-19 కేసుల సునామీ ఇప్పటికే వాటి పరిమితి దాటి ఆరోగ్య వ్యవస్థలపై ఒత్తిడిని పెంచుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్‌లు జంట ముప్పుగా మారి కొత్త కేసులను రికార్డు స్థాయికి తీసుకువెళ్లడంతో ఆసుపత్రిలో చేరడం, మరణాల పెరుగుదలకు దారితీసిందని డైరెక్టర్ జనరల్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘డెల్టా, అదే సమయంలో ఎక్కువ వ్యాప్తి కలిగించే ఓమిక్రాన్ వల్ల కేసుల సునామీకి దారితీస్తోందని నేను చాలా ఆందోళన చెందుతున్నాను’ అని అన్నారు. కరోనాతో గత రెండేళ్లుగా అలసిపోయిన ఆరోగ్య కార్యకర్తలు, పతనం అంచునకు చేరిన ఆరోగ్య వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడిని పెంచుతూనే ఉంది.. ఆరోగ్య వ్యవస్థలపై కొత్త కరోనా వైరస్ రోగుల వల్ల ఒత్తిడి మాత్రమే కాకుండా పెద్ద సంఖ్యలో ఆరోగ్య కార్యకర్తలు కోవిడ్‌తో అనారోగ్యానికి గురవుతున్నారని ఆయన ఆవేదన చెందారు. ముఖ్యంగా అమెరికాలో కేసులు భారీగా పెరిగాయని, అక్కడ అక్టోబర్‌ నుంచే వైరస్‌ విజృంభణ మరోసారి ప్రారంభమైందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా అమెరికా, ఐరోపా దేశాల్లో కనిపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గడిచిన వారంలో నమోదైన మొత్తం 49.9లక్షల కేసుల్లో 28లక్షల కేసులు కేవలం యూరప్‌లోనే ఉన్నాయి. అంతకుముందు వారంతో పోలిస్తే అక్కడి పాజిటివ్‌ కేసుల్లో 3శాతం పెరుగుదల కనిపించింది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా యూరప్‌లోనే ఇన్‌ఫెక్షన్‌ రేటు అధికంగా ఉంది. ప్రతి లక్ష జనాభాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 304.6గా నమోదవుతుందని డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేసింది. తాజా పరిస్థితులను బట్టి చూస్తే కొత్త వేరియంట్‌ ముప్పు అధికంగానే ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఎక్కువ ప్రాబల్యం డెల్టాదే ఉండగా.. తాజాగా దీన్ని మించి ఒమిక్రాన్‌ వ్యాపిస్తుందనడానికి ఆధారాలు అభిస్తున్నాయని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా గతవారంలో కొవిడ్‌ మరణాల సంఖ్య 4 శాతం తగ్గినట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. ‘‘ కోవిడ్-19కి వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి 2021లో ముగింపు పలకాలని డబ్ల్యూహెచ్‌ఓ ఆశించింది. కానీ అది వ్యాక్సిన్ సమానత్వం ఆధారపడి ఉంటుందని హెచ్చరించింది.. ప్రతి దేశం తమ జనాభాలోని 40 శాతం మందికి ఈ ఏడాది చివరి నాటికి పూర్తిగా టీకాలు వేయాలని WHO కోరింది.. 2022 మధ్య నాటికి 70 శాతం లక్ష్యంగా పెట్టుకుంది.. డబ్ల్యూహెచ్ఓ‌లోని 194 సభ్య దేశాలలో సగం కంటే ఎక్కువ 40 శాతం లక్ష్యాన్ని చేరుకోలేదని’’ టెడ్రోస్ ప్రకటించారు. ‘‘ఇది మానవాళికి సిగ్గుచేటు మాత్రమే కాదు.. మహమ్మారి ప్రాణాలను బలిగొంటుంది.. వైరస్‌ మార్పులు చెందడానికి అవకాశాలను అందించింది.. రాబోయే సంవత్సరంలో వ్యాక్సిన్ అసమానతలను తగ్గించాలని ప్రపంచ దేశాధినేతలకు నేను పిలుపునిస్తున్నాను. 2021 కష్టతరమైనప్పటికీ 2022 మధ్య నాటికి 70 శాతం వ్యాక్సిన్‌లు వేయాలనే ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లేలా నూతన సంవత్సర తీర్మానం చేయాలని నేను కోరుతున్నాను’’ అని అన్నారు.


By December 30, 2021 at 10:50AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/covid-tsunami-will-drive-health-systems-towards-collapse-warns-who-director/articleshow/88582019.cms

No comments