Breaking News

Sajjanar: మాట్లాడే ముందు ఆలోచించాలి.. చట్టపరమైన చర్యలు తప్పవు! అల్లు అర్జున్‌ సహా సెలబ్రిటీలకు చురకలు


ఇటీవల ర్యాపిడో () యాడ్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. అటో ఇటో ఎటో ఎక్కెయ్ ర్యాపిడో త్వరగా.. తేలికగా.. తక్కువగా అంటూ ఆర్టీసీ బస్‌తో పోలుస్తూ యాడ్‌లో నటించి దోసెలు వేసేశాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇది చూసి నొచ్చుకున్న ఆర్టీసీ () యాజమాన్యం ర్యాపిడో సంస్థతో పాటు అల్లు అర్జున్‌కి లీగల్ నోటీసులు పంపించింది. దీంతో ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ ఘాటుగా స్పందిస్తూ ఇలాంటి యాడ్స్ చేయకూడదని సెలబ్రెటీలకు చురకలంటించారు. యాడ్‍లో నటించిన అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థతో తనకు ఎలాంటి వ్యక్తిగత భేదాభిప్రాయాలు లేవని, ఎవ్వరైనా సరే ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్ట దిగజార్చే విధంగా వ్యవహరిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని చెబుతూ సజ్జనార్ ఘాటు రియాక్షన్ ఇచ్చారు. అల్లు అర్జున్‌‌తో పాటు ర్యాపిడో సంస్థ తక్షణమే ఆర్టీసీకి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. వాళ్ళ ప్రోడక్ట్ మంచిగానే ఉండొచ్చు గానీ కాంపిటేటర్ ప్రోడక్ట్ మంచిది కాదని చూపించడం సరికాదు. ఈ యాడ్‌లో నటించిన యాక్టర్ కూడా ఆలోచించాల్సింది. దశాబ్దాల నుంచి పేద, మధ్య తరగతి ప్రజల కోసం ఈ ఆర్టీసి పని చేస్తోంది. సెలబ్రిటీలు చెబితే నలుగురు ఇంప్రెస్ అవుతారు. కాబట్టి ఆలోచించి ఇలాంటి యాడ్స్ చేయాలి. ర్యాపిడో యాడ్ విషయంలో ప్రజా రవాణా వ్యవస్థను కించపరిచే వ్యవహరించారు కాబట్టే నోటీసులు ఇచ్చామని సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీకి రెవెన్యూ కూడా చాలా ముఖ్యమని చెప్పిన సజ్జనార్.. ప్రజల ఆదరణ లభిస్తున్న ఈ సమయంలో ఇలాంటి యాడ్స్ రావడం బాధ కలిగించిందని, వెంటనే ఈ యాడ్ తొలగిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సజ్జనార్.


By November 11, 2021 at 10:46AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ts-rtc-md-sajjanar-demands-sorry-from-allu-arjun-and-rapido/articleshow/87640591.cms

No comments