Breaking News

APS Carnage ఉగ్రదాడి కేసులో సమన్లు.. కొద్ది గంటల్లోనే కోర్టుకు హాజరైన పాక్ ప్రధాని


2014 నాటి పెషావర్ సైనిక పాఠశాలపై ఉగ్రదాడి కేసులో పాకిస్థాన్ సుప్రీంకోర్టు బుధవారం విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ ప్రధాని స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో అక్టోబరు 20న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై పాక్ ప్రభుత్వం తీసుకోకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గత నెలలో తాము ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో తెలపాలని అటార్నీ జనరల్‌ను సుప్రీంకోర్టును ఆదేశించింది. వీటికి ఆయన నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో తీవ్ర అసహనం వ్యక్తంచేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గుల్జార్ అహ్మద్ ధర్మాసనం.. తమ ఆదేశాలను ప్రధానమంత్రి చదివారా? లేదా అని ఏజీని ప్రశ్నించింది. దీంతో కోర్టు ఉత్తర్వుల కాపీని ప్రధానమంత్రికి పంపలేదని.. త్వరలోనే ఈ విషయాన్ని ఆయన తెలియజేస్తానని అటార్నీ జనరల్‌ ఖలీద్‌ జావెద్‌ ఖాన్‌ విన్నవించారు. ఏజీ సమాధానంతో ఆగ్రహించిన ధర్మాసనం.. కేసుపై మీకున్న శ్రద్ధ ఇదేనా..? అంటూ చీఫ్‌ జస్టిస్‌ మండిపడ్డారు. ‘ప్రధానిని పిలవండి.. మేమే ఆయనతో మాట్లాడుతాం.. ఇది ఇలాగే కొనసాగకూడదని ఆగ్రహం వ్యక్తం చేసిన చీఫ్‌ జస్టిస్‌.. వెంటనే ఆయన ఇక్కడకు రావాలంటూ ప్రధానమంత్రికి సమన్లు జారీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌.. ఉత్తర్వులు కొన్ని గంటల్లోనే సుప్రీం కోర్టుకు హాజరయ్యారు. అదే సమయంలోనే సుప్రీం ధర్మాసనం ఇమ్రాన్‌ ఖాన్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. ఇక పెషావర్‌ దారుణ ఘటనలో అలసత్వానికి కారణమైన మిలటరీ అధికారులపై కనీసం ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయకపోవడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. నిఘా వ్యవస్థల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పటికీ.. ఫలితం శూన్యమని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వంపై పాకిస్థాన్‌ సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి గుల్జార్‌ అహ్మద్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ తప్పులను అంగీకరించారు. ఉన్నతాధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం సాధ్యం కాదని అటార్నీ జనరల్ చెప్పారు. ‘తమ పౌరుల రక్షణ విషయానికి వచ్చేసరికి ఇంటెలిజెన్స్ ఎక్కడకి వెళ్లిపోతున్నాయి? మాజీ ఆర్మీ చీఫ్, ఇతర బాధ్యులపై కేసు నమోదు చేశారా?" అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు.


By November 11, 2021 at 10:01AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/pakistan-pm-imran-khan-attend-to-court-with-in-hours-after-issues-orders/articleshow/87639789.cms

No comments