Breaking News

Prabhas : ఎట్టకేలకు ‘రాధేశ్యామ్’ నిర్మాతల్లో కదలిక.. అప్ డేట్ ఇచ్చేశారుగా..!


ఎట్ట‌కేల‌కు ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు ‘రాధేశ్యామ్‌’ నిర్మాత‌లు ఊర‌ట‌నిచ్చారు. ఓ ర‌కంగా అంద‌రి హీరోల సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్స్ వ‌స్తున్నాయి. మా డార్లింగ్ సినిమా విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతున్నా, నిర్మాత‌లు ప‌ట్టించుకోవ‌డం లేదంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్నారు. ఏకంగా ఓ అభిమాని అయితే ‘’ నిర్మాత‌ల‌ను కార‌ణంగా చూపిస్తూ సూసైడ్ లెట‌ర్ కూడా రాసేశాడు. అభిమానుల ర‌చ్చ చూసి ఇక బాగోద‌నుకున్నారేమో. నిర్మాత‌లు ‘రాధేశ్యామ్’ అప్‌డేట్‌ను అనౌన్స్ చేశారు. జ‌స్టిన్ ప్ర‌భాక‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలో ‘ఈ రాతలే..’ అంటూ సాగే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను న‌వంబ‌ర్ 15న సాయంత్రం ఐదు గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించిన అధికారిక పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. తెలుగులో ఈ పాటను కృష్ణకాంత్ రాశారు. యువన్ శంకర్ రాజా ఆలపించారు. ప్ర‌భాస్‌, జంట‌గా న‌టించిన చిత్రం ‘రాధేశ్యామ్’. వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న మూవీ విడుద‌ల‌వుతుంది. పాన్ ఇండియా రేంజ్లో విడుద‌ల‌వుతున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో గోపీకృష్ణా మూవీస్‌, యువీ క్రియేష‌న్స్ ప‌తాకాల‌పై ప్ర‌మోద్‌, వంశీ, ప్ర‌శీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. యూర‌ప్ నేప‌థ్యంలో జ‌రిగే పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరి ఇది. ఇలాంటి లవ్ స్టోరీలో నటించడం ఇదే తొలిసారి. ఇందులో ఆయన చేతిరేఖలను చూసి భవిష్యత్తు చెప్పే విక్ర‌మాదిత్య‌గా పాత్రలో కనిపించబోతు్నారు. అలాగే మ్యూజిక్ టీచర్ ప్రేర‌ణ‌గా పూజా హెగ్డే కనిపించనుంది. మరి వీరిద్దరి జోడి ఎలా మెస్మ‌రైజ్ చేస్తారోన‌ని ఎంటైర్ సినీ ఇండ‌స్ట్రీ ఆస‌క్తిగా ఎదురుచూస్తుంది.‘జిల్‌’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. మూడు వంద‌ల కోట్ల‌పైగా భారీ బ‌డ్జెట్‌ను ఖ‌ర్చు పెట్టి సినిమాను నిర్మిస్తున్నారు. రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఇందులో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. రాధేశ్యామ్ చిత్రీక‌ర‌ణను ఎప్పుడో పూర్తి చేసిన ప్ర‌భాస్‌.. రీసెంట్‌గా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతోన్న త్రీడీ మూవీ ఆదిపురుష్’ సినిమాల‌ షూటింగ్డును పూర్తి చేసేశాడు. ఇక సలార్ చిత్రీకరణ మాత్రమే మిగిలింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న పక్కా యాక్షన్ మూవీ ఇది. వచ్చే ఏడాాది ఈ రెండు సినిమాలు డార్లింగ్ ఫ్యాన్స్‌ ముందుకు రాబోతున్నాయి. ఆ వెంటనే నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌బోయే ‘ప్రాజెక్ట్ కె’.. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శ‌క‌త్వంలో త‌న మైల్‌స్టోన్ మూవీ...25వ చిత్రం ‘స్పిరిట్‌’ చిత్రాల‌ను సెట్స్ పైకి తీసుకెళ్ల‌బోతున్నారు ప్ర‌భాస్‌.


By November 13, 2021 at 12:30PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/prabhas-radhe-shyam-lyrical-video-song-update/articleshow/87680888.cms

No comments