Breaking News

Jinnah Row కాంగ్రెస్ వల్లే దేశ విభజన.. అసుదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు


ఒకవేళ జరిగుండకపోతే మహ్మద్ అలీ జిన్నా భారత్‌కు తొలి ప్రధాని అయ్యేవారని సుహాల్దేవ్ భారతీయ సమాజ్‌వాదీ పార్టీ (SBSP) అధ్యక్షుడు ఓపీ రాజ్బర్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ స్పందించారు. దేశ విభజనకు , ఆ పార్టీ నేతలే కారణమని ఆయన విమర్శించారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. విభజన ముస్లింల వల్ల జరగలేదని, జిన్నా వల్ల జరిగిందని వ్యాఖ్యానించారు. ‘దేశ విభజనకు ముస్లింలు కారణం కాదు.. జిన్నాయే.. ఈ విషయంలో చరిత్రలు చదవని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ నేతలకు సవాల్ విసురుతున్నాను.. ఆ సమయంలో నవాబులు లేదా డిగ్రీ హోల్డర్ల వంటి ప్రభావవంతమైన ముస్లింలకు మాత్రమే ఓటువేసే అవకాశం ఉంది.. విభజనకు ఆనాటి కాంగ్రెస్‌, ఆ పార్టీ నాయకులే బాధ్యులు’ అన్నారు. వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఎస్పీ, ఎస్బీఎస్పీలు కలిసి పోటీ చేయనున్నాయి. రెండు రోజుల కిందట ఎస్బీఎస్పీ అధ్యక్షుడు ఓపీ రాజ్బర్ వారణాసిలో మాట్లాడుతూ.. దేశ విభజన జరిగుండకపోతే మహ్మద్ అలీ జిన్నా భారత్‌కు మొట్టమొదటి ప్రధాని అయ్యేవారు. ఈ చారిత్రాత్మక ఘటనకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కారణమని రాజ్‌భర్ ఆరోపించారు. కాగా, కాస్‌గంజ్ ఘటనపై యూపీ పోలీసుల తీరును అసదుద్దీన్ ఒవైసీ ఎండగట్టారు. ‘కాస్‌గంజ్ సంఘటన మీ ముందు ఉంది...తన కొడుకు పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకుని చనిపోయాడని అల్తాఫ్ తండ్రి చెప్పారు.. ఇది పోలీసుల హత్యే.. వారికి హత్యలు తప్ప దర్యాప్తు చేయడం రాదు’ అని విమర్శించారు.


By November 12, 2021 at 11:41AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/congress-responsible-for-partition-says-mim-chief-asaduddin-owaisi-amid-jinnah-row/articleshow/87661249.cms

No comments