Breaking News

‘అన్ని కష్టాల తర్వాత అందమైన ఆరంభం ఉంటుంది’.. కొత్త లుక్‌లో ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చిన నాగశౌర్య


విభిన్నమైన సినిమాలు చేస్తూ.. తనకంటూ తెలుగు ఇండస్ట్రీలో ఓ గుర్తింపు సంపాదించుకున్నారు నాగశౌర్య. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఆయన సినిమాలు చేస్తూ ఉంటారు. ఇక హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ల‌క్ష్య’. సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగ‌‌శౌర్య స‌ర‌స‌న కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్రలో విలక్షణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు న‌టిస్తున్నారు. ఆర్చరీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో నాగశౌర్య మాజీ ఆర్చరీ ప్లేయర్ పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ విడుదలైన పోస్టర్లు.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా టీజర్ కూడా విడుదల చేశారు. రీసెంట్‌గా సినిమా నుంచి హీరో, హీరోయిన్లతో కలిపి ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌లో శౌర్యని, హీరోయిన్ కేతికా నుదుటిపై ముద్దుపెట్టుకుంటూ ఉంది. ఇది గతంలో జరిగిన ఆయన లవ్‌స్టోరీ అని తెలుస్తోంది. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ సరికొత్త పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌లో నాగశౌర్య ఓ చేతిలో ధనుస్సు.. మరో చేతిలో బాణాలను పట్టుకొని ఆసక్తికరంగా కనిపిస్తున్నారు. ‘అన్ని కష్టాల తర్వాత అందమైన ఆరంభం ఉంటుంది’ అంటూ నాగశౌర్య ఈ పోస్టర్‌ని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. పోస్టర్‌లో నాగశౌర్య మహాభారతంలో అర్జునుడిలా ఉన్నారు అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.


By August 15, 2021 at 02:01PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/hero-naga-shaurya-movie-lakshya-new-poster-released/articleshow/85346012.cms

No comments