Bheemla Nayak: మళ్లీ అడ్డంగా దొరికిపోయిన థమన్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..
అయన ప్రస్తుతం టాప్ పోజిజన్‌లో ఉన్న మ్యూజిక్ డైరక్టర్.. తెలుగులోనే కాదు.. కోలీవుడ్‌లో కూడా అతను బిజీ మ్యూజిషన్. ప్రస్తుతం టాప్ హీరోల సినిమాలకు సంగీతం అందిస్తూ బిజీగా ఉన్నారు ఆయన. అతనే . ఇప్పుడు నెం.1 మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్న ఆయనకు తాజాగా మరోసారి చేదు అనుభవం ఎదురైంది. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘’. మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ సినిమా రీమేక్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుంచి పవన్ పాత్రను పరిచయం చేసిన చిత్ర యూనిట్. ఆ తర్వాత ఓ చిన్న మేకింగ్ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా పవన్ ఫ్యాన్స్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అదిరిపోయే కానుక ఇచ్చారు. అదే ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ గ్లింప్స్. ఈ టీజర్‌లో పవన్ లుక్స్‌తో పాటు ఆయన డైలాగ్స్, యాక్షన్ అన్ని దుమ్ములేపేశాయి. వీటన్నికంటే ప్రధానంగా థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది. అయితే ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. ఈ టీజర్‌లోని మ్యూజిక్‌ని కూడా థమన్ కాపీ చేశాడు అంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. థమన్ గతంలో ఇలాంటి ట్రోల్స్ చాలానే ఎదురుకున్నారు. అయినా కూడా ఆయన వాటిపై పెద్దగా రియాక్ట్ అయిన సందర్భాలు చాలా తక్కువ. కానీ, ఇప్పుడ ‘భీమ్లా నాయక్’ టీజర్ విషయంలో కూడా ట్రోల్స్ రావడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ టీజర్‌లో ఓ బిట్‌లో థమన్ అందించిన సంగీతం.. ‘పెట్టా’ సినిమాలోని ఓ పాటలోని మ్యూజిక్‌తో పోలి ఉంది అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ‘ప్రతీసారి ఇలానే మోసం చేస్తావా’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి దీనిపై థమన్ రియాక్ట్ అవుతారో లేదా చూసి చూడనట్లు వదిలేస్తారో చూడాలి. ఇక ఈ సినిమాకి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. పవన్‌కు జోడీ నిత్య మీనన్ నటిస్తోంది.
By August 15, 2021 at 01:08PM
No comments