సీక్రెట్ పుట్టుమచ్చ చూపిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రచ్చ.. ఆమెనలా చూసి రెచ్చిపోతున్న నెటిజన్స్!
టెక్నాలజీ బాగా విస్తరించడంతో ఆన్‌లైన్ తెరలపై సెలబ్రిటీల హంగామా ఎక్కువవుతోంది. ఆడియన్స్‌తో కనెక్ట్ కావడానికి సోషల్ మీడియా ఖాతాలను వినియోగిస్తున్నారు నటీనటులు. తమ వ్యక్తిగత వివరాలతో పాటు పర్సనల్ లైఫ్, ఫొటోలు షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. హీరోహీరోయిన్స్‌తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా సోషల్ మీడియా హవా నడిపిస్తుండటం చూస్తున్నాం. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేర్లు సురేఖా వాణి, ప్రగతి. వీళ్ళిద్దరూ నెట్టింట చేసే రచ్చ మామూలుగా ఉండదు. తాజా ఫొటో చూస్తుంటే ఇప్పుడు అదే లిస్ట్‌లో మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చేరిపోయారని తెలుస్తోంది. 1998 సంవత్సరంలో చిరంజీవి హీరోగా వచ్చిన 'మాస్టర్' సినిమాతో సినీ గడపతొక్కి దాదాపు అందరు అగ్ర హీరోల సినిమాల్లో నటించారు ప్రియ. హీరోయిన్లకు అందమైన అమ్మ పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్ లతో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో కూడా తెర పంచుకున్న ఆమె.. నేటికీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. పలు సీరియల్స్ కూడా చేస్తున్న ప్రియ ఇటీవలే 'ఉప్పెన' మూవీలో కనిపించారు. ఇకపోతే సాధారణంగా ఎప్పటినుంచో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న ప్రియ.. ఈ మధ్యకాలంలో రెగ్యులర్ పోస్టులతో ఆకర్షిస్తున్నారు. వరుసపెట్టి తన ఫొటోస్ షేర్ చేస్తూ నెటిజన్లతో నిత్యం టచ్ లోకి వస్తున్నారు. అయితే రీసెంట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అయింది. అందుకు ప్రధాన కారణం.. తన నడుముపై పుట్టుమచ్చ కనిపించేలా ప్రియ పోజివ్వడం. దీంతో ఇలా ఆ సీక్రెట్ పుట్టుమచ్చ చూసి ''ప్రియ వెరీ హాట్, ఏమని వర్ణించను నీ సౌందర్య ముగ్ధ మనోహరాన్ని'' అంటూ రెచ్చిపోతూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ప్రియకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె ఫాలోవర్ల సంఖ్య 1 మిలియన్‌కు చేరువలో ఉంది.
By June 21, 2021 at 11:49AM
No comments